సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): సిటీ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్‌పై నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులోప్రవేశపెట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ విచారణలో మొత్తం 105 మందిని హాజరుపరచగా, వారిలో 17 మంది వ్యక్తులకు జైలు శిక్షతో పాటు రూ.41,000 జరిమానా విధించిందని వారు పేర్కొన్నారు. ఈ విచారణలో మొత్తం రూ.2,39,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.