AEE | సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగంలో మరింత బలోపేతం కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు 146 మంది ఏఈఈలు కొత్తగా నియమాకం కాగా.. ఇందులో జీహెచ్ఎంసీకి 125 మంది ఏఈఈలు రిపోర్టు చేశారు. ఈ మేరకు వీరంతా సోమవారం జీహెచ్ఎంసీలో జాయిన్ రిపోర్టు ఇచ్చి ఆయా పదవిలో బాధ్యతలు చేపట్టనున్నారు.