నేర పరిశోధనలో భేష్
‘ఆలస్యంగా జరిగిన న్యాయం కూడా అన్యాయంతో సమానం’ అన్నారు మహానుభావులు. నేరం జరిగిన వెంటనే స్పందించి, దానిని ఛేదించి బాధితులకు న్యాయం చేయడంలో తెలంగాణ పోలీసులు ఆదర్శం. అదే దారిలో వనస్థలిపురం పోలీసులు పయణించారు.
- 80శాతం కేసులను ఛేదించిన వనస్థలిపురం పోలీస్
- స్నాచింగ్‌ల నివారణలో సక్సెస్
- ప్రజల సహకారంతో మంచి ఫలితాలు : సీఐ సత్యనారాయణ
వనస్థలిపురం, డిసెంబర్ 30 : ‘ఆలస్యంగా జరిగిన న్యాయం కూడా అన్యాయంతో సమానం’ అన్నారు మహానుభావులు. నేరం జరిగిన వెంటనే స్పందించి, దానిని ఛేదించి బాధితులకు న్యాయం చేయడంలో తెలంగాణ పోలీసులు ఆదర్శం. అదే దారిలో వనస్థలిపురం పోలీసులు పయణించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10వ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 713 పోలీస్ స్టేషన్లలో 17వ స్థానంలో నిలిచారు. దీంతో ప్రజల్లో మరింత నమ్మకాన్ని పొందారు.
ప్రజల సహకారంతోనే..
ప్రజల సహకారం, సీసీ కెమెరాల నిఘాతో నేర పరిశోధనలో ఉత్తమ ఫలితాలు సాధించగలిగాం, ఫ్రెండ్లీ పోలీస్, కమ్యూనిటీ పోలీసింగ్‌లో ప్రజల నుంచి సహకారం లభించింది. మా సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ నేర నివారణ, పరిశోధన చేయగలిగాం. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అనుమానిత వ్యక్తులు, వస్తువుల సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. సైబర్ నేరగాళ్లు అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
– కోలా సత్యనారాయణ, సీఐ
నేరాల తీరు ఇలా…
హత్య, డెకాయిట్ కేసుల్లో 100శాతం పూర్తి చేశారు. దోపిడీ కేసుల్లో 98శాతం కేసులు ఛేదించి, సొత్తును కూడా రికవరీ చేశారు. దొంగతనాల కేసుల్లో 59శాతం పూర్తి చేసి, సొత్తును రికవరీ చేశారు. దొంగతనాల కేసుల్లో ఓ నేరస్తుడి వద్ద నుంచి 2 కేజీల బంగారాన్ని రికవరీ చేసి రికార్డు సృష్టించారు. మిస్సింగ్ కేసుల్లోనూ 90శాతం పరిశోధన పూర్తి చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి 48 గంటల్లో పూర్తి చేసిన కేసులు కోకొల్లలుగా ఉన్నాయి.
సైబర్ నేరాలను ఛేదించారు…
వనస్థలిపురం పోలీసులు సైబర్ నేరాలను ఛేదించడంలోనూ ముందున్నారు. గతంలో సైబర్ నేరాలను ఎల్బీనగర్ నుంచి పరిశోధించారు. 2022లో ఇక్కడే కేసు నమోదు చేసి పరిశోధించారు. ఓటీపీలు, బ్లాక్ మెయిల్, ఛీటింగ్ చేస్తూ అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేసేవారి పీచ మణిచారు. సైబర్ నేరాల్లో 90శాతం ఛేదించి, బాధితులకు న్యాయం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

