ఈ ఏడాది గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్న కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. శనైశ్చరుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. మంచి ఫలితాలు సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్లు విశేష లాభాలు ఆర్జిస్తారు. ఏప్రిల్ నుంచి గురుబలం కాస్త మందగించినా.. సమస్యలు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. భూమి కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. పదోన్నతి అవకాశం ఉంది. సమయోచిత నిర్ణయాల వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పాతబాకీలు వసూలు అవుతాయి. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది.
ఈ ఏడాది గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గురు, శని యోగిస్తారు. కేతువు శుభ ఫలితాలు ఇస్తాడు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా ప్రయోజనాలు ఉన్నాయి. మూడో వ్యక్తి జోక్యం లేకుండా జాగ్రత్తపడండి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి మరమ్మతులు చేపడతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల ఆదరణ లభిస్తుంది. రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్లకు న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వొచ్చు. సంవత్సరం మధ్యలో స్వల్పంగా అనారోగ్యం తలెత్తవచ్చు. ఈ సమయంలో కొన్ని పనులు సునాయాసంగా నెరవేరుతాయి. కొన్ని సంక్లిష్టంగా పరిణమిస్తాయి. ఆగస్టు నుంచి మళ్లీ అన్నీ సర్దుకుంటాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఏడాది చివర్లో ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
ఈ ఏడాది గురువు, శని, రాహువు పూర్తిస్థాయి అనుకూల ఫలితాలు ఇస్తారు. మిగతా గ్రహాలు సైతం యోగిస్తాయి. ఈ ఏడాది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మానవ ప్రయత్నానికి అదృష్టం కలిసివస్తుంది. రెండున్నరేండ్లుగా ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటీ దూరమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. అయితే, నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఏడాది ద్వితీయార్ధంలో అందుకు తగిన వాతావరణం ఏర్పడుతుంది. చాలారోజులుగా పరిష్కారం లభించని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. విహారయాత్రలు చేపడతారు. ఉద్యోగులు గుర్తింపు పొందుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు జోరందుకుంటాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. సత్కార్యాలకు డబ్బు వినియోగిస్తారు. రాజకీయ ప్రముఖులకు జనాదరణ లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. బంధువర్గానికి అండగా నిలుస్తారు.
ఈ రాశి వారికి గురువు, రాహువు అనుకూల ఫలితాలు ఇస్తారు. అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే మిగతా గ్రహాల స్థితి అనుకూలంగా ఉండటం వల్ల ఈ ఏడాది సింహభాగం సత్ఫలితాలు పొందుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా విజయాలు ఉన్నాయి. అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. నియంత్రణ అవసరం. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. భూ లావాదేవీల్లో ఓ మోస్తరు లాభాలు కలుగుతాయి. రాజకీయ ప్రముఖులకు మంచి సమయం. చాకచక్యంగా పనులు చక్కబెడతారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తీర్థయాత్రలు చేపడతారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీవనశైలి సంతృప్తికరంగా కొనసాగుతుంది. పాతబాకీలు వసూలు అవుతాయి.
ఈ రాశి వారికి గ్రహబలం మిశ్రమంగా ఉంది. నాలుగు నెలలు గడిచిన తర్వాత పూర్తి అనుకూల ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రణాళికలు పక్కాగా అమలుచేసి దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. రాబడి పెరిగినప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులు మంచి పనితీరును కనబరుస్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలన అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సంవత్సరం చివర్లో కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
ఈ సంవత్సరం ఉన్నతంగా ఉంటుంది. దాదాపు అన్ని గ్రహాలూ అనుగ్రహిస్తాయి. జీవనశైలిలో ఉన్నతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా ఈ ఏడాది ఎలాంటి లోటూ రాదు. సంపదను పెంచుకునే ప్రయత్నంలో సఫలం అవుతారు. ఏప్రిల్, మే నెలల్లో ఒడుదొడుకులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. జూన్ నుంచి మళ్లీ అన్నీ సర్దుకుంటాయి. పలుకుబడి పెరుగుతుంది. రుణ బాధలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఒత్తిళ్లను అధిగమిస్తారు. ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ నిరుత్సాహపడరు. పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. ఏప్రిల్ తర్వాత గురు అనుగ్రహం లభిస్తుంది. శనైశ్చరుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఉద్యోగులు చాకచక్యంగా పనులు నిర్వర్తిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. విమర్శలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ పనులు చేపడతారు. రాబడి పెరగడంతో ధైర్యంగా ఉంటారు. వ్యాపారులకు ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. జీవనశైలిలో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ఏడాది ద్వితీయార్ధంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తారు. విద్యార్థులు రాణిస్తారు. విదేశాల్లో విద్య కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. శని బలం తక్కువగా ఉంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కానీ, ప్రత్యేక పనులు, నూతన వ్యాపారం విషయంలో సమస్యలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ ఏడాది వాయిదా వేసుకోవడం మంచిది. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. జీవన విధానంలో తరచూ చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. గురుబలం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. బాకీలు కొంతవరకు తీరుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంవత్సరం మధ్యలో అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. పెద్దల సలహాలు, సూచనలు పాటించి సత్ఫలితాలను పొందుతారు. ఏడాది ద్వితీయార్ధంలో కార్యసాఫల్యం ఉంది. సమాజంలో మంచి ఆదరణ ఉంటుంది. స్థిరాస్తి మూలంగా ఆదాయం సమకూరుతుంది. బంధు వర్గంతో విభేదాలు తొలగిపోతాయి.
ఈ రాశివారికి ఈ సంవత్సరం ఉన్నతంగా ఉంటుంది. ఏల్నాటి శని నుంచి విముక్తులు అవుతున్నారు. గురు బలం కూడా తోడవుతున్నది. ఫలితంగా ఈ సంవత్సరం పూర్తిస్థాయిలో సత్ఫలితాలు పొందుతారు. వివాహం, ఉద్యోగం, సంతానం, గృహం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలం. బంధువులతో అనుబంధాలు మెరుగవుతాయి. విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగుల పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. పూర్వం ఉన్న సమస్యలు దాదాపుగా పరిష్కారం అవుతాయి. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. నలుగురికి సాయం చేస్తారు. భూమి కొనుగోలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది.
ఈ రాశివారికి గురువు కొంత అనుకూలంగా ఉన్నాడు. ఏల్నాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది. ఈ సంవత్సరం చాలావరకు ఉత్తమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అధికారులతో స్నేహంగా ఉంటారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. బంధువర్గం సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే కల నెరవేరుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇంట్లో శుభకార్యం చేస్తారు. సంతానం వల్ల సంతోషం పొందుతారు. ఏడాది ద్వితీయార్ధంలో ఖర్చులు పెరగవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. అన్నదమ్ముల మధ్య విభేదాలు సమసిపోతాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త పరిచయాల వల్ల కార్యసాఫల్యం ఉంది. గతంలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు. జీవనశైలి సంతృప్తికరంగా ఉంటుంది.
ఈ రాశివారికి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ శని బలం తక్కువగా ఉంది. రాశిలో శని సంచారం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. విమర్శలు అధికమవుతాయి. గురువు అనుకూలంగా ఉండటంతో సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఏడాది ప్రథమార్ధంలో కాస్త అటూఇటుగా ఉన్నా ద్వితీయార్ధంలో మళ్లీ పుంజుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి పదేపదే ఆలోచించడం తగదు. సంయమనంతో వ్యవహరించాలి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. భూమి విషయంలో తగాదాలు ఏర్పడవచ్చు. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి.
ఈ రాశివారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. ఏల్నాటి శని ప్రభావం మొదలవుతున్నది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. భారీ పెట్టుబడులకు ఈ ఏడాది అనువైన సమయం కాదు. మే తర్వాత కొంత అనుకూలమైన మార్పు ఉంటుంది. అప్పటివరకు భారీ పెట్టుబడులకు సంబంధించిన పనులు చేపట్టకపోవడం మంచిది. ఏడాది ద్వితీయార్ధంలో వ్యాపారం పుంజుకుంటుంది. కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అయితే శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికాంశాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు, బంధువులతో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. జీవనశైలి సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.