కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రుణ బాధలు కొంతవరకు తీరుతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. రాబడి మార్గాలు పెరుగుతాయి. పిల్లల చదువు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు అనుకున్న స్థాయిలో రాణిస్తారు. స్నేహితులతో విభేదాలు ఏర్పడవచ్చు. వారాంతంలో మానసిక ఆందోళనలు కలుగుతాయి. పనివారితో ఇబ్బందులు ఏర్పడవచ్చు.
ఈ వారం మెరుగైన ఫలితాలు ఉంటాయి. న్యాయవాద, వైద్యవృత్తిలో ఉన్నవారికి అనుకూలిస్తుంది. రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. పనిలో నిబద్ధతతో, మంచి ఆలోచలనతో ముందుకు వెళ్లడం అవసరం. అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దు. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్నవారు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావచ్చు. కొత్త పనులు కొంత కాలం వాయిదా వేసుకోవడం మంచిది.
పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. ఉపాధ్యాయ, వైద్యవృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తోబుట్టువులతో మాటపట్టింపులు రావచ్చు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
రియల్ ఎస్టేట్ రంగం ఉన్నవారికి ఈ వారం కలిసొస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. పెద్దల సహకారం అందుతుంది. తీర్థయాత్రలు చేపడతారు. కోర్టు వ్యవహారాలు కలిసివస్తాయి. కుటుంబసభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. సంయమనం అవసరం. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. సహోద్యోగులతో మాటపట్టింపులు రావచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది.
స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది.
ఈ వారం కార్యసాఫల్యం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. స్నేహితులు, బంధువర్గంతో పనులు కలిసివస్తాయి. వాహనం, భూముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పనులు చేయడంపై మనసు నిలుపుతారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ఏకాగ్రత, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. రాబడి స్థిరంగా ఉంటుంది.
ఈ వారం ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహకారంతో కొనసాగుతాయి. రాబడిపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, పనులపై మనసు నిలపడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో అసంబద్ధ నిర్ణయాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. ఆత్మీయుల సలహాతో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపార, ఆర్థిక లావాదేవీలలో జాప్యం జరగవచ్చు. అయితే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.
కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషం పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పదోన్నతి వల్ల స్థానచలనం ఉండవచ్చు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కళాకారులకు మంచి సమయం. కొత్త అవకాశాలు వస్తాయి.
తలపెట్టిన పనులు నలుగురి సహకారంతో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పెద్దల సూచనలను పాటించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. విద్యార్థులకు కలిసివస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పనులను సంతోషంగా స్వీకరించి, సమర్థంగా పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది.
కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సమయానికి పనులను పూర్తిచేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగవుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థికాంశాల్లో తొందరపాటు తగదు.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ఏమైనా సమస్యలు వస్తే, వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. ఆర్థికస్థితి మెరుగవుతుంది.
కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులను చేయడంపై మనసు నిలుపుతారు. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.