తలపెట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ విద్య అవకాశాలు మెరుగవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
వృత్తిలో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులు పూర్తిచేయడంపై దృష్టి సారించండి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అధికారులతో స్నేహం కొనసాగుతుంది. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు రావొచ్చు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శివారాధన మేలు చేస్తుంది.
పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. ఏకాగ్రతతో పనులు చేస్తారు. రాబడి మార్గాలపై దృష్టిసారిస్తారు. అనవసరమైన ఖర్చులు ముందుకురావొచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించండి.
ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. కొన్ని పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
తలపెట్టిన పనులు సకాలంలో అవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రామాలయాన్ని సందర్శించండి.
పెద్దల సహకారం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్లవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుభవజ్ఞుల సహకారంతో పనులు చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. సంయమనం అవసరం. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ పరమైన ఖర్చులు పెరుగుతాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటూ, పనులను పూర్తి చేసుకుంటారు. పదోన్నతి, ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
పాతబాకీలు వసూలు అవుతాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రయాణాలతో పనులు నెరవేరుతాయి. బంధువులతో కార్యసాఫల్యం ఉంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. శివారాధన శుభప్రదం.
ఉద్యోగులకు ఆఫీసులో తోటివారితో స్నేహం పెరుగుతుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. శ్రమతో పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెద్దల విషయంలో గౌరవంగా ఉంటారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని విషయాలలో అనవసరమైన తగాదాలు రావచ్చు. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
శుభకార్య, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. కొత్త దుస్తులు, ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. గౌరవ మర్యాదలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితాలను పొందుతారు. విహారయాత్రలకు వెళ్తారు. కళాకారులకు అనుకూలం. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
కొత్త ఉద్యోగంలో చేరతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒక పక్కన బరువు, బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. అయితే వృథా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సంయమనంతో ముందుకు వెళ్తారు. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.
పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉన్నా జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహిత్యవేత్తలకు, కళాకారులకు అనుకూలం. వ్యాపార విస్తరణ చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం కలిసివస్తుంది. రామారక్షా స్తోత్రం పఠించండి.
– గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in