ఈ వారం రాశి ఫలాలు.. ఆగస్ట్ 30. 8 .2026 నుంచి సెప్టెంబర్ 05 .09.2026 వరకు
వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకురావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
మేషం
వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకురావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
వృషభం
పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.
మిథునం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులపై మనసు నిలుపుతారు. ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధికారులతో స్నేహంగా ఉండటం అవసరం. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. శివారాధన శుభప్రదం.
సింహం
బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. భూ లావాదేవీలు కలిసివస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
కన్య
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూల వారం. మంచి సంస్థలలో అవకాశాలు వస్తాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలు పాటించడం అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.
తుల
ఇంటా, బయటా అనుకూల వాతావరణం. రావలసిన డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు కొంతవరకు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. శివారాధన శుభప్రదం.
వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ధనుస్సు
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. గురు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టడం అవసరం. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. రామాలయాన్ని సందర్శించండి.
మకరం
ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరిగినా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో కన్నా ఈ వారం బాగుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. విహారయాత్రలు చేపడతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా, ఆఖరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. దుర్గాదేవి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.
కుంభం
కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చేస్తున్న వృత్తి, సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. వారాంతంలో శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మీనం
వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. సంయమనం పాటించండి. కార్యనిర్వహణపై మనసు నిలపండి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

