Weekly Horoscope | మేషం
వాహనాలు, భూముల కొనుగోలులో జాగ్రత్త. వ్యవసాయదారులకు సంతృప్తికరం. ఉద్యోగులకు స్థానచలన సూచన. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు రాణిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాజకీయ నాయకులకు అనుకూలం.
వృషభం
ఉద్యోగులకు ఉన్నతాధికారులతో స్నేహం పెరుగుతుంది. పనులు పూర్తవుతాయి. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. మరింత శ్రమించాల్సి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నలుగురికి సాయపడుతారు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. రాజకీయ నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. రావలసిన డబ్బు కొంత అందుతుంది.
మిథునం
కోర్టు పనుల వల్ల ఖర్చులు ఉంటాయి. కాలయాపన తప్పదు. అనుకోని అంశాలు ముందుకు వస్తాయి. వ్యాపారంలో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల పనుల్లో జాప్యం ఉండవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి.
కర్కాటకం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడితో పనులు పూర్తి చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొత్త వాహనం కొనుగోలుకు అవకాశాలు. భూ లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహం
తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. కళాకారుల ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు. డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయటా సంతోషంగా ఉంటారు. భార్యా పిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.
కన్య
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సమస్యలను అధిగమిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు మంచిస్థాయిలో నిలుస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. స్నేహితులతో చిన్నపాటి మనస్పర్ధలు ఎదురైనా పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంటి వాతావరణం అన్నివిధాలా సహకరిస్తుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది.
తుల
సమాజంలో మంచిపేరు పొందుతారు. చాలా పనులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో సత్సంబంధాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలకు నలుగురి సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనులలో కొన్ని అవాంతరాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది.
వృశ్చికం
రాజకీయ వ్యవహారాలు సంతృప్తికరం. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరం. స్నేహితులు, బంధువుల సాయంతో పనులు పూర్తవుతాయి. అన్నదమ్ములు, ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో స్నేహంగా ఉంటారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. విహార యాత్రలు, దూర ప్రయాణాలు చేస్తారు.
ధనుస్సు
ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. పట్టుదలతో విజయం సాధిస్తారు. తోటి ఉద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురైనా, ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. లక్ష్యాలను బాధ్యతతో పూర్తిచేస్తారు. రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఫలితాలు అనుకూలం. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. స్నేహితులు, బంధువర్గం సాయంతో పనులు నెరవేరుతాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు.
మకరం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరం. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. సాహితీవేత్తలకు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యవసాయ దారులకు అనుకూలం.
కుంభం
బరువు బాధ్యతలు పెరుగుతాయి. పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలకు అందరి సహకారం లభిస్తుంది. సకాలంలో డబ్బు అందకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. గురుభక్తి పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. అనవసర వివాదాల వల్ల మనశ్శాంతి దూరం అవుతుంది. పారిశ్రామికవేత్తలు సమస్యలను అధిగమిస్తారు.
మీనం
అందరి సహకారం లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలుస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. రావలసిన డబ్బు అందుతుంది. నిర్మాణ కార్యకలాపాలు చేపడతారు. ఆస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు. తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.