మేషం
ఈ వారం అనుకూలం. పనిచేసే చోట చాకచక్యంగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మంచివారితో స్నేహబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధుమిత్రులతో కార్యసిద్ధి ఉంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. విఘ్నేశ్వర ఆరాధన శుభప్రదం.
వృషభం
శ్రమ పెరుగుతుంది. తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. నిధుల కొరతతో కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. అన్నదమ్ముల సహాయం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఈశ్వర ఆరాధనతో మేలు కలుగుతుంది.
మిథునం
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమయోచిత నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో
చికాకులు తొలగిపోతాయి. శివాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
బంధువర్గంతో కార్యసిద్ధి ఉంది. కొత్త వాహనం, స్థలం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. సత్ఫలితాలు సాధిస్తారు. ఆదిత్య హృదయస్తోత్రం నిత్యం పఠించండి.
సింహం
ప్రారంభించిన పనులు అనుకూలిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం. ఆఫీసులో అధికారుల అండదండలు లభిస్తాయి. అయితే, తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పెట్టుబడులకు అనుకూల సమయం. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు రాణిస్తారు. కళాకారులకు మంచి సమయం. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. విందులకు హాజరవుతారు. ఆరోగ్యంగా ఉంటారు. విఘ్నేశ్వర ఆరాధన మంచిది.
కన్య
బంధువుల మూలంగా పనులు నెరవేరుతాయి. విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితాలు అందుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయంలో అస్థిరత ఉండవచ్చు. ముందుచూపుతో వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్థిరాస్తి వల్ల ఆదాయం కలిసివస్తుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
తుల
పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అదృష్టం వెన్నంటి ఉంటుంది. వారాంతంలో మానసికంగా ఆందోళనకు గురవుతారు. ఒక వార్తతో కలత చెందుతారు. బంధువులతో వాగ్వివాదాలు చోటుచేసుకోవచ్చు. దుర్గాదేవి ఆరాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
రుణబాధలు తొలగిపోతాయి. కొత్త వస్తువులు కొంటారు. అందరి సహకారం లభిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాలకు అనుకూల సమయం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అందరితో స్నేహంగా ఉంటారు. కష్టేఫలి అన్నట్లుగా ఉంటుంది. ఇంట్లోవారితో చర్చించి, సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పారిశ్రామికవేత్తలకు వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. గణపతిని ఆరాధించండి.
ధనుస్సు
ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. సంయమనంతో వ్యవహరిస్తారు. పెద్దలతో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు చదువుకోండి.
మకరం
శుభకార్యాలను చేస్తారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. విందులు, వినోదాలపై మనసు నిలుపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేపడతారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. హనుమద్ ఆరాధన శుభప్రదం.
కుంభం
ఉత్సాహంతో పనులు చేస్తారు. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. అనుకోని ఖర్చులు ముందుకువస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందించుకునే ఆలోచన చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఓపికతో వ్యవహరించడం అవసరం. కళాకారులకు అనుకూల కాలం. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. శివారాధన మేలు చేస్తుంది.
మీనం
గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాలలోకి వెళ్లకుండా సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా ఉంటాయి. విశ్వాసంతో ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దుర్గా స్తోత్రాలు చదువుకోండి.