Weekly Horoscope | మేషం
ఈ వారం సాహసించి పనులు చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో ఒత్తిళ్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు తావివ్వకండి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అందుతుంది. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. వారాంతంలో ఆశించిన లబ్ధి పొందుతారు. విదేశీ ప్రయాణాలు వాయిదాపడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృషభం
సమాజంలో గౌరవం పెరుగుతుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా కొన్ని పనులు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉల్లాసంగా ఉంటారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగులకు శ్రమకు తగ్గ గుర్తింపు, ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారులకు పనివారితో ఇబ్బందులు తలెత్తవచ్చు.
మిథునం
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి. అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టం రావచ్చు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావొచ్చు. కొత్తపనులను వాయిదా వేసుకోవడం మంచిది. వారం ద్వితీ యార్థ్ధంలో అన్నిటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటకం
సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఈ వారం అన్నిటా మేలు జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల వల్ల ధనలాభం సూచితం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.
సింహం
పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఒత్తిళ్లను అధిగమించి పట్టుదలతో ముందుకుసాగుతారు. ఉద్యోగులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. రాబడిని మించిన ఖర్చులు ఉంటాయి. వారం మధ్యలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. దాని కారణంగా అనుకూలమైన మార్పు కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. వ్యాపార ఒప్పందాల విషయంలో తొందరపాటు తగదు. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ పాటించండి. ఇష్ట దేవతార్చన వల్ల మేలు జరుగుతుంది.
కన్య
అదృష్టం కలిసివస్తుంది. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. బంధువులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు పెద్దలను సంప్రదిస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. భూ లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
తుల
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. విందులకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విహార యాత్రలకు వెళ్తారు. పెద్దల సహకారం లభిస్తుంది.ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది. నూతన ఒప్పందాల విషయంలో తొందరపాటు తగదు. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆస్తి తగాదాలు ముందుకురావచ్చు.
వృశ్చికం
అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయోచితంగా వ్యవహరిస్తారు. సాహసంతో అడుగులు వేస్తారు. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక ప్రయోజనం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో బంధువుల సహకారం ఆశిస్తారు. భవన నిర్మాణ రంగంలో ఉన్నవాళ్లు లాభాలు గడిస్తారు. స్థిరాస్తి వల్ల ఆదాయం సమకూరుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు.
ధనుస్సు
పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి తినకపోవడం, అనవసరమైన ఆలోచనల కారణంగా నిస్పృహతో ఉంటారు. వారాంతంలో శుభవార్త వింటారు. కోర్టు, రాజకీయ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారులకు మంచి సమయం. నూతన ఒప్పందాల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం.
మకరం
అలసట లేకుండా పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రణాళికా బద్ధంగా పనులు చేపడతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. డబ్బు సమయానికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
కుంభం
రావలసిన డబ్బు వస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. సభలు, సమావేశాలకు హాజరవుతారు. సమాజంలో గుర్తింపు ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు అనుకూల స్థానచలనం ఉండవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. సహోద్యోగులతో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. బంధువర్గంతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు.
మీనం
మంచి ఆలోచనలు కలుగుతాయి. ప్రణాళికా బద్ధంగా పనులు చేపడతారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. అన్నదమ్ములు, బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. పెద్దల సహకారంతో వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. భాగస్వాముల సహకారం లభిస్తుంది. వారం మధ్యలో కొన్ని చికాకులు ఏర్పడతాయి. సమయానుకూల నిర్ణయాలతో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.