పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వారాంతంలో మీ అభీష్టం నెరవేరుతుంది. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహకారంతో పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. నవగ్రహ ఆలయానికి వెళ్లండి.
ఆహార నియమాలు పాటించడం అవసరం. బంధువర్గంతో పొరపొచ్చాలు రావచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పనులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి సమయం. అధికారుల అండ దండలు లభిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. విదేశీ విద్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. సకాలంలో సరైన నిర్ణయాలు అమలుచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
అదృష్టం కలిసివస్తుంది. అధికారులతో సత్సంబంధాలు పెంపొందుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థికంగా సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకోగలరు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. వ్యాపారులకు మంచి సమయం. విద్యార్థులకు పట్టుదల అవసరం. నిర్మాణ పనులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
ఈ వారం ప్రోత్సాహకరం. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. స్థిర, చరాస్తుల వల్ల ఆదాయం సమకూరుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. స్నేహితుల సహకారం పొందుతారు. అవివాహితులకు పెండ్లి కుదిరే అవకాశం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, కోర్టు పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సేవాభావం పెంపొందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. వారం మధ్యలో కొంత అధైర్యానికి గురవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అదృష్టంపై ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకోవాలి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. కళాకారులకు మంచి సమయం. ఇంటా బయటా ప్రోత్సాహకరవాతావరణం ఉంటుంది. శివారాధన వల్ల మేలు కలుగుతుంది.
కాలం అనుకూలంగా మారుతున్నది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు స్థాన
చలన సూచన. ఆర్థికంగా ఓ మోస్తరుగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దల సూచనలు పాటించండి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. జటిలమైన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్ల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆఫీసు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలకు సరైన సమయం కాదు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాధన ఉన్నప్పటికీ, గుడ్డిగా నమ్మడం సరికాదు. కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరగవచ్చు. శివారాధన శుభప్రదం.
భక్తి భావం పెరుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పనితనంతో అధికారుల మన్ననలు అందుకుంటారు. వృథా ఖర్చులు ముందుకు రావచ్చు. నూతన దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలను సరైన సమయంలో అమలులో పెడతారు. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. ఆరోగ్యంగా ఉంటారు. రామాలయాన్ని సందర్శించండి.
పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. పలుకు
బడితో పనులు నెరవేరుతాయి. సూర్య నమస్కారాలు చేసుకోండి.
శుభకార్యాల వల్ల ఖర్చులు ఉంటాయి. సహోద్యోగులతో, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. పలుకుబడి పెరుగుతుంది. సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఈ వారం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమయం ప్రోత్సాహకరంగా ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. అధికారులతో స్నేహం పెంపొందించుకుంటారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన చేసుకోండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in