భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. అందరి సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. నైపుణ్యంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణకు మంచి సమయం. వ్యాపార భాగస్వాముల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. న్యాయపరమైన సమస్యలు తొలగిపోతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకూల సమయం.
ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉటుంది. అన్నదమ్ములతో అనుబంధం పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. విస్తరణ పనులు జోరందుకుంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినప్పటికీ, అందుకు తగ్గ గుర్తింపూ లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వ పనులు త్వరగా నెరవేరుతాయి. నలుగురికీ సాయపడతారు. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు.
కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరుగుతుంది. అనుకోని సంఘటనలు మనసుకు చికాకు కలిగిస్తాయి. వారాంతంలో శుభవార్త వింటారు. విధి నిర్వహణపై దృష్టి సారించడం అవసరం. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఖర్చులు పెరిగినప్పటికీ.. అందుకు తగ్గ ఆదాయమూ ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. పట్టుదలతో పనులు పూర్తిచేయడం అవసరం. ఆరోగ్యంగా ఉంటారు.
కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటూ, పనులు పూర్తి చేసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది.
పాతబాకీలు వసూలు అవుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసి
వస్తుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యసిద్ధి ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వర్తిస్తారు. విద్యార్థులు మంచిస్థాయిలో నిలుస్తారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధువర్గంతో మనస్పర్ధలు రావొచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి ద్వారా రాబడి వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహన సౌఖ్యం ఉంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
మంచిపేరు పొందుతారు. ఉద్యోగులు విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకోవడం అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రమ అధికమైనప్పటికీ అనుకున్నది సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు,
సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో పనులు పూర్తవుతాయి. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి.
శ్రద్ధతో పనులు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆగిన పనుల్లో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. సమస్యలను అధిగమిస్తారు. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది.
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉంటారు. పనులపై మనసు నిలుపుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ, సహకారం లభిస్తుంది. తీర్థయాత్రలు చేపడతారు. పారిశ్రామికవేత్తలకు శ్రేయోభిలాషుల సహకారం లభిస్తుంది.
విద్యార్థులు మంచి స్థాయిలో నిలుస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. రావలసిన డబ్బు అందుతుంది. గృహనిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనులపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది.