Weekly Horoscope : ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యనిర్వహణలో సంయమనం అవసరం. పనిచేసే విధానంలో మార్పువల్ల అభివృద్ధి కలుగుతుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. శివారాధన మేలు చేస్తుంది.
ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అనుకూల వారం. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో కలిసివస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. సత్ఫలితాలను పొందుతారు. మంచి అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. అనుకున్న డబ్బు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనులలో ఆటంకాలు రావచ్చు. రెట్టింపు శ్రమ అవసరం. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు రావచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులపై మనసు నిలుపుతారు. రామాలయాన్ని సందర్శించండి.
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. పురాణ ప్రవచనాలకు హాజరవుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం వల్ల ఖర్చులు పెరగవచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
కోర్టు సమస్యలు తీరుతాయి. రుణబాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులను పూర్తిచేసుకోవడం మంచిది. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
న్యాయ సమస్యలు తీరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంతో ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురికి సహాయపడే మనస్తత్వం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అయితే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. తోటివారితో మనస్పర్థలు రావచ్చు. భూ వ్యవహారం లాభిస్తుంది. కొంత సంయమనం అవసరం. శివాలయాన్ని సందర్శించండి.
పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. న్యాయ సమస్యలు తీరుతాయి. రాజకీయ ప్రభుత్వ పనులలో ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. రోజువారీ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. భూ లావాదేవీల్లో కాలయాపన ఉండవచ్చు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
సమయ పాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. బంధుమిత్రుల సహకారంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలను చేపడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. బాధ్యతతో మెలగడం అవసరం. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. లలితాదేవి స్తోత్రాలు పఠించండి.
ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. వృథా ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహం పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఖర్చులు పెరగవచ్చు. సూర్యారాధన శుభప్రదం.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in