రాబడి పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపార ప్రయత్నం కొనసాగుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి కలిసివస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. పనులలో శ్రమ అధికం. అయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల వారం. న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడతారు. భూ లావాదేవీల్లో కాలయాపన జరిగినప్పటికీ, అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనుల్లో ఈ వారం కదలిక వస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల లబ్ధి పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. భక్తి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. వాహనం, భూమి కొనుగోలు చేస్తారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు సఫలం అవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పై అధికారులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. సంయమనంతో పనులు చేయడం అవసరం. ఖర్చుల నియంత్రణ అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. తీర్థయాత్రలు చేపడతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. విద్యార్థులు శ్రమించాల్సిన వారం. విందులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉత్సాహంతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు.
కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. అయితే, తోటి ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సంయమనం అవసరం. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. మిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనులలో జాప్యం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలపడం మంచిది. పెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు.
తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి. వ్యాపార లావాదేవీలు, ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు వస్తాయి. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. నిత్యం చేసే వ్యాపారం సంతృప్తిగా ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంతో కలిసి విందులు, వినోదాలకు వెళ్తారు. అన్నదమ్ములు, బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆత్మీయుల సహకారం అందుతుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఏ పని తలపెట్టినా ఆలోచించి అడుగువేయండి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో పనులు పూర్తిచేస్తారు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులతో సమస్యలు తలెత్తవచ్చు. అనవసరమైన చర్చలతో వివాదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. విహారయాత్రలు వాయిదాపడతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు.
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో అనుకూల తీర్పు ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తికర ఫలితాలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది. మానసిక సంతృప్తిని పొందుతారు. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. విదేశీ ప్రయాణాలు వాయిదా పడవచ్చు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు రావచ్చు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. రెట్టింపు శ్రద్ధతో పనులు చేయడం అవసరం.
బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూ వ్యవహారం లాభిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆఫీసులో అందరితోనూ స్నేహంగా ఉంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. వృథా ఖర్చులు, కాలయాపన ఉండవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయుల సహకారాన్ని పొందుతారు. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. ఉన్నత భావాలు గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
మంచి సంస్థలలో ఉద్యోగంలో చేరతారు. పై చదువులకు అనుకూలం. విదేశీ ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. మనసు నిలిపి పనులు చేస్తారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం కలిసివస్తుంది. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. కోర్టు కేసులలో అనుకూల తీర్పులు వస్తాయి. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్తారు.
ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కోర్టు కేసులు కలిసివస్తాయి. కొత్త పెట్టుబడులు వాణిజ్యంపై మనసు నిలుపుతారు. నలుగురికి సాయం చేస్తారు. భక్తి పెరుగుతుంది. భూ వ్యవహారంలో జాగ్రత్త అవసరం. వాహనం కొనుగోలు చేస్తారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కూడిన కార్యసాఫల్యం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు.