Surya Budha Yuti Yogam | జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడు, బుధుడు ఆగస్టులో ఒకేరాశిలో కలువనున్నారు. దాంతో ప్రత్యేక యోగం ఏర్పడనున్నది. అదే ‘బుధాదిత్య యోగం’గా పిలుస్తారు. ఇది వేద జ్యోతిషశాష్త్రంలో అత్యంత శుభకరమైన, ప్రభావవంతమైన రాజయోగాల్లో ఇది ఒకటి. సూర్యుడు ఆత్మ, విశ్వాసం, నాయకత్వం, కీర్తిని ప్రసాదిస్తాడు. బధుడు తెలివి, కమ్యూనికేషన్, తార్కికం, విశ్లేషణాత్మక సామర్థ్యానికి సూచిక. ఈ రెండు గ్రహాలు ఒక రాశిలో కలిసి వచ్చిన సమయంలో సూర్యుడు అధికారం, నాయకత్వం, ఆధిపత్యంతో పాటు ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు.
ఈ యోగం ఒక వ్యక్తి ఆలోచనలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని పొందే శక్తిని ప్రసాదించనున్నది. అలాంటి వ్యక్తులు జ్ఞానం, దూరదృష్టితో వేగంగా ముందుకు సాగి అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి సూర్యుడు, బుధుడి సంయోగం మరోసారి ఏర్పడుతోంది. ఇది అనేక రాశులవారికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ యోగం ఎవరి జాతకంలో ఈ సంయోగం ఎలాంటి ప్రభావం చూపనున్నది. ఈ కాలంలో వృత్తిరంగంలో పురోగతి, గౌరవం పెరుగుదల, ఆర్థిక స్థితి బలోపేతం వంటి సానుకూల మార్పులు చూస్తారు. ఈ శుభ యోగం కారణంగా ఏ రాశులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందో.. ఈ యోగ ప్రభావం ఎంత శక్తివంతగా ఉంటుందో తెలుసుకుందాం..!
మిథున రాశి అధిపతి బుధుడు, సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఈ సంయోగం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగ ప్రభావం కారణంగా మిథున రాశివారు కెరీర్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా మంచి లాభాలను సంపాదిస్తారు. ఈ రాశివారు ప్రతి ఉదయం రాగి పాత్రలో నీటిని నింపి సూర్యుడికి నైవేద్యం పెట్టంటాలి. దాంతో మానసిక సమతుల్యత, శక్తిని ప్రసాదిస్తుంది.
బుధుడు కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాయి. సూర్యుడితో కలిసినప్పుడు, బుధాదిత్య యోగం మరింత ప్రభావవంతంగా మారుతుంది. కన్యా రాశి ఉద్యోగంలో పదోన్నతి, పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మీ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ వాక్చాతుర్యం, పెట్టుబడులతో లాభాలను పొందుతారు. ఈ రాశివారు ఈ సమయంలో ఆవులకు పచ్చి మేత వేస్తే శుభప్రదంగా ఉంటుంది. ఇది మీ అదృష్టాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
సింహరాశి అధిపతి సూర్యుడు. ఈ రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రాశి వారి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రభుత్వ పథకాలలో విజయం, సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం పొందడం ఖాయం. ఈ రాశివారు ‘ఓం ఘృణిః సూర్యాయ నమః’ అనే మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించాలి. ఇది ఆత్మవిశ్వాసం, అదృష్టాన్ని పెంచుతుంది.
ఈ యోగం తులరాశి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి వృద్ధి, భాగస్వామ్యంలో లాభం, ఆదాయంలో పెరుగుదల, వ్యక్తిగత సంబంధాల్లో సమతుల్యత ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక స్థిరత్వం, సామాజిక సామరస్యాన్ని పెంచుతుంది. తెల్లటి దుస్తులు ధరించి సాయంత్రం స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించండి. ఇది లక్ష్మీ ఆశీస్సులను నిలుపుకుంటుంది.
మకర రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక కెరీర్లో, సామాజిక గౌరవంలో అపారమైన వృద్ధిని తీసుకువస్తుంది. కార్యాలయంలో మీ పనితో అందరినీ ఆకట్టుకుంటారు. మీ ప్రణాళికలు విజయవంతమవుతుంది. మీకు సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం చేకూరే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నువ్వులు, బెల్లం దానం చేయాలి. మీ ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు చాలా ఫలవంతంగా నిలుస్తుంది.