మేషం
బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. బాల్యమిత్రులను కలుసుకుంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తిలో హోదా పెరుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రణాళికతో పనులు నిర్వహించండి. శుభకార్యాలతో ఖర్చులు పెరగవచ్చు. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. దుస్తులు, ఆభరణాలు కొంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారులకు మంచి సమయం. పెట్టుబడులకు తగిన ప్రతిఫలాలు అందుతాయి. రాజకీయ పనులు అనుకూలిస్తాయి.
వృషభం
కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పనులు నిరాటంకంగా ముందుకు సాగుతాయి. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విహారయాత్రలు చేస్తారు. అందరితో సామరస్యంగా ఉంటారు. భూ వ్యవహారాల్లో వివాదాలు తలెత్తవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గం సహకారం పొందుతారు. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
మిథునం
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. న్యాయ సమస్యలు తీరుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. పనుల్లో కాలయాపన ఉన్నప్పటికీ, లాభసాటిగా పూర్తవుతాయి.
కర్కాటకం
శుభకార్యాలలో బంధువుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖర్చులు పెరగవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. నలుగురికి సాయపడతారు. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. కోర్టు కేసులలో అనుకూల తీర్పు ఉంటుంది. అదృష్టం కలిసివస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి.
సింహం
అన్నదమ్ములు, బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. విందులకు హాజరవుతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో రెట్టింపు శ్రమ, శ్రద్ధ అవసరం. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. దైవకార్యాలకు సాయం చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణాలు చేపడతారు. వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి.
కన్య
ఆదాయం పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. భూ వ్యవహారాల్లో సమస్యలు రావచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల చేయూత పొందుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరుతారు.
తుల
ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. శారీరకంగా శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపాలి. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. రుణ బాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నిరుత్సాహానికి గురికాకుండా పనులను పూర్తిచేయడంపై దృష్టి సారించండి. కోర్టు సమస్యలు తీరుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
వృశ్చికం
కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ముఖ్యమైన పనులు చేపడతారు. భూ వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులను నియంత్రించండి. బంధువర్గం సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, వారాంతంలో వాటిని అధిగమిస్తారు.
ధనుస్సు
వివాదాలకు దూరంగా ఉంటారు. సంయమనంతో వ్యవహరిస్తారు. న్యాయ సమస్యలు తీరుతాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులలో ఖర్చులు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. కావలసిన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు.
మకరం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూమి కొనుగోలు వ్యవహారాలు వాయిదా పడతాయి. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. దాయాదులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి. తెలివిగా ముందడుగు వేయండి. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. పనిభారం పెరగడంతో అలసటకు గురవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగుల పనితనానికి గుర్తింపు లభిస్తుంది.
కుంభం
ఆదాయం క్రమేణా పెరుగుతుంది. సమయపాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు. బంధుమిత్రుల సాయం లభిస్తుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. మంచి అవకాశాలు వస్తాయి. పాత సమస్యలు తీరడంతో కొంత ఊరట లభిస్తుంది. రాజకీయ, ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు బాధ్యతతో మెలగడం అవసరం. కుటుంబసభ్యుల సహకారంతో పనులు నెరవేరుతాయి.
మీనం
వృథా ఖర్చులు ఉంటాయి. నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సాహితీ సభలకు హాజరవుతారు. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో కొత్త రకమైన విధానాన్ని ప్రవేశపెడతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య నమ్మకం పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఖర్చులు పెరగవచ్చు. ఆత్మీయులు, అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దలతో కాలం గడుపుతారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in