పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఇంట్లో వాళ్లతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో వ్యవహరించండి. వృథా ఖర్చులు ఉంటాయి. నియంత్రణ అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. భక్తి పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా బాధ్యతలపై మనసు నిలపండి. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. భూములు, వాహనాల విషయంలో కలిసి వస్తుంది. అయితే నిర్ణయాలలో కొంత అప్రమత్తత అవసరం. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. పదోన్నతి అవకాశం ఉంది. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది.
విద్యార్థులు చదువులో రాణిస్తారు. కుటుంబ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. విదేశీ ప్రయాణాల విషయంలో ఇబ్బందులు రావచ్చు. వాహనాల వల్ల ఖర్చులు ఉంటాయి. స్థిరాస్తి విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు. రాజకీయ, ప్రభుత్వ పనులలో విజయం చేకూరుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువర్గంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. డబ్బు చేతికి రావడంలో ఇబ్బందులు. చెల్లింపుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకుంటారు. గత ఒప్పందాలు అనుకూలిస్తాయి. రాజకీయ పనులలో ఆలస్యం. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. ఉత్పాదన, రాబడి సంతృప్తికరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సహోద్యోగులతో సమస్యలు రావచ్చు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. ఆర్థిక స్థిరత్వంతో సంతృప్తిగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఆనందం పొందుతారు. పనిచేసే చోట కొంత సంయమనం అవసరం. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలుపై మనసు నిలుపుతారు. ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పనిభారంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. అయితే ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. వ్యాపారం సజావుగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రయాణాల మూలంగా అలసట, వృథా ఖర్చులు ఉండవచ్చు.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు.
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. పనులలో జాప్యం ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు ఉంటాయి. సంయమనం అవసరం. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సాంస్కృతిక కార్య
క్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. కొత్త పనులు వాయిదా పడతాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరినప్పటికీ, గుడ్డిగా నమ్మడం తగదు. శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆస్తి తగాదాలు కొంత పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in