Numerology | పుట్టిన తేదీపై కూడా మనిషి స్వభావం ఆధారపడి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఎంతో పట్టుదల, మొండితనం కలిగి ఉంటారట. తమ నిర్ణయాలను అంత సులువుగా మార్చుకోరని అంటున్నారు. కొన్నిసార్లు అయితే తప్పు చేసినా సరే దాన్ని అంగీకరించకుండా తమ వాదననే సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంటున్నారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలాంకం 7, మూలాంకం 8 కలిగిస వ్యక్తులు తమ అభిప్రాయాలను అంత సలువుగా మార్చుకోరని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. తమ అభిప్రాయాల విషయంలో చాలా దృఢంగా ఉంటారని అంటున్నారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 7, 16, 25వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 7గా పరిగణిస్తారు. ఈ మూలాంకంపై కేతు ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ మూలాంకం కలిగిన వ్యక్తులు లోతైన ఆలోచనలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. తమకంటూ ప్రత్యేక ఆలోచనా విధానం ఉంటుందని నమ్ముతుంటారు.
ఈ వ్యక్తులు ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం చాలా కష్టమని అంటారు. తాము అనుకున్నదే కరెక్ట్ అని భావించే స్వభావం కారణంగా ఇతరుల అభిప్రాయాలను సులువుగా అంగీకరించారు. ఏదైనా విషయంలో పొరపాటు జరిగినా కూడా దానిని నేరంగా ఒప్పుకోవడం కంటే తమ వాదనకు అనుకూలంగా కారణాలను వెతుక్కోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
ఈ మూలాంకం 7 గల వ్యక్తులు సాధారణంగా ఇంట్రోవర్ట్ అయ్యి ఉంటారు. వీరు ఎక్కువగా తమ ఆలోచనల ప్రపంచంలోనే గడిపేస్తుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపించినా.. తమ అభిప్రాయాల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మీరు చేసిన పని లేదా తీసుకున్న నిర్ణయం తప్పు అని ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే అంగీకరించరు. ముందుగా దాన్ని విశ్లేషించి, తర్వాత మాత్రమే స్పందిస్తారు. అందుకే వీరిని మొండివాళ్లు అని అనుకునే అవకాశం ఉంది.
సంఖ్యాశాస్త్రం ప్రకారం 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8గా పరిగణిస్తారు. ఈ మూలాంకంపై శనిగ్రహ ప్రభావం ఉంటుందని చెబుతారు. మూలాంకం 8 కలిగిన వ్యక్తులు క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, లక్ష్యసాధన వంటి విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ వ్యక్తులు జీవితంలో విజయాన్ని సాధించేందుకు ఎంతో శ్రమిస్తారని, తమ ప్రయత్నాలపై గట్టి నమ్మకం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అయితే అదే సమయంలో తమ అభిప్రాయాలను మార్చుకోవడంలో కొంత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.
మూలాంకం 8 గల వ్యక్తులు ఏదైనా విషయంపై నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత దాన్నే బలంగా సమర్థిస్తారు. ఎవరైనా విభేదించినప్పుడు తమ అభిప్రాయాన్ని తర్కాలతో సమర్థించేందుకు ప్రయత్నిస్తారు. తప్పు జరిగిందని తెలిసినా వెంటనే అంగీకరించకుండా పరిస్థితిని విశ్లేషిస్తూ.. సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే వీరిలో పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడేతత్వం కూడా ఎక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయాలను సాధించే అవకాశాలు వీరిలో ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలాంకం 7, 8 గల వ్యక్తులను కేవలం మొండివాళ్లుగా మాత్రమే చూడలేమని నిపుణులు చెబుతున్నారు. వీరిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, లక్ష్యసాధనకు అవసరమైన దృఢ సంకల్పం కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలే మొండితనంగా కనిపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారట.. ఎందుకో తెలుసా?
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తను ఎక్కువగా ప్రేమిస్తారట..!