Numerology | ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు.. ఎవరితో మాట్లాడినా క్షణాల్లో కనెక్ట్ అయిపోతారు!
Numerology | మన చుట్టూ ఉండే వారిలో కొందరు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. వారి మాటతీరు, ఆత్మవిశ్వాసం, ఇతరులతో కలిసిపోయే స్వభావం ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ లక్షణాల వల్లే కొత్తగా పరిచయమైన వారికి కూడా క్షణాల్లో ఆకట్టుకుంటారు. అ
Numerology | మన చుట్టూ ఉండే వారిలో కొందరు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. వారి మాటతీరు, ఆత్మవిశ్వాసం, ఇతరులతో కలిసిపోయే స్వభావం ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ లక్షణాల వల్లే కొత్తగా పరిచయమైన వారికి కూడా క్షణాల్లో ఆకట్టుకుంటారు. అయితే ఇలాంటి స్వభావానికి వారి పుట్టిన తేదీకి సంబంధం ఉంటుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
సంఖ్యా శాస్త్రం ప్రకారం.. కొన్ని మూలాంకాలు చెందిన వ్యక్తులు సహజంగానే చురుకుదనం, ఆకర్షణ, స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు. వారి ప్రవర్తన, మాట్లాడే తీరు కారణంగా చూసేవారికి ఆ వ్యక్తి ఇతరులను ఫ్లర్టింగ్ చేస్తున్నాడేమో అన్నట్లుగా అనిపించవచ్చు. అయితే అది తప్పనిసరిగా ప్రతికూల లక్షణం కాదని.. సామాజికంగా కలిసిపోయే నైపుణ్యంగా కూడా భావించవచ్చని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మూలాంకం 5
ఏ నెలలోనైనా 5, 14, 23వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 5గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి బుధ గ్రహం అధిపతి. బుధుడు వాక్చాతుర్యం, తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాలకు ప్రతీకగా చెబుతుంటారు. కాబట్టి మూలాంకం 5 కలగిన వారికి కొత్త వ్యక్తులను కలవడం, కొత్త విషయాలను తెలుసుకోవడం అంటే ఎంతో ఇష్టం. వీరు చాలా తక్కవ సమయంలోనే ఎదుటివారితో సాన్నిహిత్యం పెంచుకోగలరు. చమత్కారంగా మాట్లాడటం, సరదా సంభాషణలు వీరికి వెన్నతో పెట్టిన విద్య. అందవల్ల వీరి స్నేహపూర్వక స్వభావాన్ని ఫ్లర్టింగ్గా భావించే అవకాశం ఉంటుంది.
మూలాంకం 6
ఏ నెలలోనైనా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6. ఈ మూలాంకానికి శుక్ర గ్రహం అధిపతి. ప్రేమ, అందం, కళలు, రొమాన్స్ వంటి అంశాలకు శుక్రుడు ప్రతీకగా చెబుతారు. మూలాంకం 6 గల వారికి అందంగా కనిపించడం, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించడం ఇష్టం. వీరి వ్యక్తిత్వంలోనే ఒకవిధమైన ఆకర్షణ ఉంటుంది. అందరితో మర్యాదగా, ఆప్యాయంగా మాట్లాడటం వీరికి అలవాటు. అందుకే వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెద్దగా ఉంటుంది.
మూలాంకం 3
ఏ నెలలోనైనా 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3 గా ఉంటుంది. ఈ మూలాంకంపై గురు గ్రహ ప్రభావం ఉంటుందని సంఖ్యాశాస్త్రం పేర్కొంటుంది. ఈ మూలాంకం కలిగిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కూడా సహజంగా ఉంటాయి. వీరు నలుగురిలో చురుగ్గా ఉంటారు. తమ మాటలతో చుట్టుపక్కల వారిని ఉల్లాసంగా ఉంచుతారు. అందరితో కలిసిపోవడం, స్నేహపూర్వకంగా ఉండటం వీరి స్వభావం. అందువల్ల కొన్నిసార్లు వీరి ప్రవర్తనను కూడా ఫ్లర్టింగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే అంకశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం మూలాంకం ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలను మాత్రమే అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి ప్రవర్తన, స్వభావం, నిర్ణయాలు అతని పెంపకం, పరిసరాలు, వ్యక్తిగత అనుభవాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇటువంటి విశ్లేషణలను కేవలం ఆసక్తికర సమాచారంగా మాత్రమే పరిగణించాలని సూచిస్తున్నారు.
Read More:
Numerology | వీళ్లు యాటిట్యూడ్‌లో కింగ్.. అయినా సక్సెస్ కోసం గొడ్డులా కష్టపడతారు..!
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

