అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 2 వ్యయం: 14 రాజపూజ్యం: 5 అవమానం: 7
చైత్రం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒడుదొడుకులు ఉంటాయి. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
వైశాఖం: గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం క్రమేపి పెరుగుతుంది. ఇంటా, బయటా సంతోషంగా ఉంటారు. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి.
జ్యేష్ఠం: ఉద్యోగులకు మంచి సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి, స్థానచలనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు.
ఆషాఢం: ఈ మాసంలో పరిస్థితులు మారుతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. అనవసరమైన ఆలోచనలతో ఇబ్బంది పడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి.
శ్రావణం: శుభకార్యాలు వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరం. కొత్త పరిచయాలతో ఇబ్బందులు ఏర్పడతాయి. భూములు, వాహనముల మూలంగా ఖర్చులు పెరుగుతాయి.
భాద్రపదం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాల వల్ల అలసట, ఇబ్బంది ఎదురువుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి.
ఆశ్వయుజం: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అన్నదమ్ములు, బంధుమిత్రులతో చికాకులు తలెత్తుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కార్తికం: గతంతో పోలిస్తే అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మార్గశిరం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం. పై అధికారులతో స్నేహంగా మెలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది.
పుష్యం: ఈ నెలలో మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. బంధుమిత్రులతో వైషమ్యాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.
మాఘం: వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నెల చివరిలో అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ తగ్గుతుంది.
ఫాల్గుణం: ఈ నెల అనుకూలం. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. మంచివారితో స్నేహం కుదురుతుంది.
కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 1 అవమానం: 3
చైత్రం: ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో రాబడి ఉండదు. ఉద్యోగ రీత్యా బదిలీలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి.
వైశాఖం: పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. భూ, వాహన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆత్మీయులతో తగాదాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు ముందుకు వస్తాయి.
జ్యేష్ఠం: ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు సరైన సమయంలో నెరవేరుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఆషాఢం: ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
శ్రావణం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువర్గం, స్నేహితుల సూచనలను పాటించి, సత్ఫలితాలను పొందుతారు.
భాద్రపదం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ, రాజకీయ పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆశ్వయుజం: తలపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సకాలంలో నిర్ణయాలను తీసుకుంటారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కార్తికం: ఈ నెలలో సంతృప్తికర ఫలితాలు ఉన్నాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది.
మార్గశిరం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
పుష్యం: ఈ మాసంలో గ్రహస్థితి సత్ఫలితాలనిస్తుంది. సంగీత, సాహిత్య, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి.
మాఘం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. సమస్యలు తీరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
ఫాల్గుణం: ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమ ఫలితాలనిస్తుంది. ప్రారంభించిన పనులలో శ్రమ ఎక్కువ అవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ రీత్యా స్థల మార్పు ఉంటుంది.
మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆదాయం: 14 వ్యయం: 2 రాజపూజ్యం: 4 అవమానం: 3
చైత్రం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వైశాఖం: ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. శుభకార్యాలకు హాజరవుతారు.
జ్యేష్ఠం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమం. అన్ని విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచన. బంధువర్గంతో కలహ సూచన.
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటారు.
శ్రావణం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు, గృహ నిర్మాణ పనులు చేపడతారు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంటుంది.
భాద్రపదం: ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రద్ధ కనబరుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసర చర్చల మూలంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆస్తి తగాదాలు ముదురుతాయి.
ఆశ్వయుజం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చుల నియంత్రణ అవసరం.
కార్తికం: విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అయితే, ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి.
మార్గశిరం: ఉత్సాహంతో పనులు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది.
పుష్యం: ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం.
మాఘం: పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు.
ఫాల్గుణం: అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. భూ లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల సలహాలు పాటించండి.
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 8 వ్యయం: 2 రాజపూజ్యం: 7 అవమానం: 3
చైత్రం: కుటుంబంతో కాలం సంతోషంగా గడుపుతారు. పిల్లల విషయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వైశాఖం: బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నెల చివరిలో ఊహించని విధంగా లబ్ధి చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించండి.
జ్యేష్ఠం: విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
ఆషాఢం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కీలక పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
శ్రావణం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమంగా పెరుగుతుంది. గతంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.
భాద్రపదం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు.
ఆశ్వయుజం: నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధిపథంలో కొనసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు.
కార్తికం: కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీస్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. నలుగురికి సాయపడతారు.
మార్గశిరం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటారు.
పుష్యం: ఈ నెలలో గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
మాఘం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలను పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఫాల్గుణం: పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అదృష్టం కలిసివస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేయడంలో విజయం సాధిస్తారు.
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 11 వ్యయం: 11 రాజపూజ్యం: 3 అవమానం: 6
చైత్రం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల సలహాలను పాటిస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వైశాఖం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు తొందరగా పూర్తిచేస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపారులకు మంచి సమయం. సంతృప్తిగా ఉంటారు.
జ్యేష్ఠం: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. చదువులో రాణిస్తారు. బంధువులతో పనులు నెరవేరుతాయి.
ఆషాఢం: ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు పెరుగుతాయి. తోటివారితో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. స్థానచలనం, ఉద్యోగ మార్పు సూచన. స్నేహితులు, ఆత్మీయులతో కొన్ని పనులు నెరవేరుతాయి.
శ్రావణం: ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వివాదాలకు తావివ్వకుండా పనులపై దృష్టి సారించండి. భూ వ్యవహారంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
భాద్రపదం: వాహన, భూ వ్యవహారాలు కలిసి వస్తాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. స్థిర, చరాస్తుల తగాదాలు పరిష్కరం అవుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.
ఆశ్వయుజం: సంయమనంతో పనులు చేస్తారు. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. సహోద్యోగులు, పై అధికారుల ప్రోత్సాహంతో లబ్ధి చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించడం ద్వారా మేలు కలుగుతుంది.
కార్తికం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
మార్గశిరం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. రాబడి పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
పుష్యం: ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మాఘం: శ్రమ ఎక్కువైనా.. అందుకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కార్యసాఫల్యం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు.
ఫాల్గుణం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన ఆలోచనలతో కొన్ని విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆచితూచి స్పందించడం అవసరం.
ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆదాయం: 14 వ్యయం: 2 రాజపూజ్యం: 6 అవమానం: 6
చైత్రం: ఆత్మీయుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సలహాలు, సూచనలను పాటిస్తారు.
వైశాఖం: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. భూమి కొనుగోలు చేస్తారు.
జ్యేష్ఠం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు.
ఆషాఢం: రాజకీయ, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన ఉంది. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.
శ్రావణం: ఈ నెలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమ అధికం అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నెల చివరికల్లా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులకు అధికారులతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి.
భాద్రపదం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే, ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో వైషమ్యాలు ఏర్పడతాయి.
ఆశ్వయుజం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమంగా పెరుగుతుంది. అన్నదమ్ములతో ఆస్తుల విషయమై ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది.
కార్తికం: ఈ నెలలో గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
మార్గశిరం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్యంతో ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు.
పుష్యం: ఈ నెల అనుకూలిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారం లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి.
మాఘం: ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. నలుగురికి సాయపడతారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కార్యసాఫల్యం ఉంది.
ఫాల్గుణం: ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులను చేపడతారు. ఇంటా, బయటా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 2 అవమానం: 2
చైత్రం: పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులు, ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు పనులు అనుకూలిస్తాయి.
వైశాఖం: ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
జ్యేష్ఠం: గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారులు అనుకూల నిర్ణయాలతో లాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
ఆషాఢం: ప్రారంభంలో అనుకూలంగా ఉంటూ, చివరిలో ప్రతికూలత ఎదురవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి.
శ్రావణం: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూములు, వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది.
భాద్రపదం: స్థిర, చరాస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. శ్రమతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో తోటి వారితో సమస్యలు ఏర్పడతాయి. కానీ అధికారుల ఆదరణ లభిస్తుంది.
ఆశ్వయుజం: గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి.
కార్తికం: విద్యార్థులు చదువులో మంచి ఫలితాలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు.
మార్గశిరం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. స్నేహితులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది.
పుష్యం: జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏకాగ్రతతో పనులు చేయాలి. సంయమనంతో ముందడుగు వేయాలి. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మాఘం: కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సహాయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. స్థిర, చరాస్తుల విషయంలో ఉన్న తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల కలయిక సంతోషాన్నిస్తుంది.
ఫాల్గుణం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి.
విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం: 2 వ్యయం: 14 రాజపూజ్యం: 5 అవమానం: 3
చైత్రం: ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంయమనంతో పనులు చేస్తారు.
వైశాఖం: ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. భూమి కొనుగోలు చేస్తారు. నలుగురికి సాయపడతారు.
జ్యేష్ఠం: ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు పనులు సానుకూలంగా ఉంటాయి. కార్య సాఫల్యం ఉంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
ఆషాఢం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు.
శ్రావణం: రాబడి పెరుగుతుంది. సంయమనంతో వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతారు.
భాద్రపదం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
ఆశ్వయుజం: నెల ప్రారంభంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. చివరిలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. సంతోషంతో, ఉత్సాహంతో పనులు చేస్తారు. భూమి కొనుగోలు చేస్తారు.
కార్తికం: ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు కాలం కలిసి వస్తుంది.
మార్గశిరం: ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. స్నేహితులు, బంధువులతో కార్యసాఫల్యం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఏకాగ్రతతో పనులు చేస్తారు.
పుష్యం: ప్రారంభించిన పనుల్లో శ్రమ అధికం అవుతుంది. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు.
మాఘం: సంయమనంతో పనులు చేస్తారు. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు.
ఫాల్గుణం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంయమనంతో పనులు చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 1 అవమానం: 5
చైత్రం: కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు ఏకాగ్రతతో
చేస్తారు. ప్రభుత్వ పనులు పూర్తి కావడం కొంత ఆలస్యమవుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
వైశాఖం: తలపెట్టిన పనుల్లో సానుకూలత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
జ్యేష్ఠం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త పనులు చేయడంపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు.
ఆషాఢం: విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా కార్యసిద్ధి ఉంది. బంధుమిత్రులతో సంతృప్తి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
శ్రావణం: కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ, రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
భాద్రపదం: కొత్త పనులు ప్రారంభించే ఆలోచనలో ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. శారీరక శ్రమ పెరగవచ్చు.
ఆశ్వయుజం: ప్రయాణాలు కలిసి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సూచనలతో పనులు నెరవేరుతాయి.
కార్తికం: అధిక శ్రమతో పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన విషయాల ఆలోచన వలన అధైర్యం చోటు చేసుకుంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మార్గశిరం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంగా పనులు చేస్తారు. సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
పుష్యం: ఆదాయం పెరుగుతుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు, రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి.
మాఘం: ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అవసరం. ముఖ్యమైన పనులలో జాప్యం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సాహితీవేత్తలకు అనుకూలం.
ఫాల్గుణం: రాబడి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓపికతో పనులు చేస్తారు. ఆఫీసులో తోటి వారితో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం: 8 వ్యయం: 14 రాజపూజ్యం: 4 అవమానం: 5
చైత్రం: ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపారం లాభసాటిగా కొనసాగినా, సిబ్బందితో ఇబ్బంది ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.
వైశాఖం: రావలసిన డబ్బు అందుతుంది. తలపెట్టిన పనులు ఇట్టే పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. వాహనం విషయంలో ఖర్చులు ఉంటాయి.
జ్యేష్ఠం: ప్రారంభించిన పనులు ఆటంకాలతో పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు స్థానచలన సూచన. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.
ఆషాఢం: రావలసిన డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
శ్రావణం: అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పనులలో శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల వల్ల అలసటకు గురవుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి.
భాద్రపదం: ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆశ్వయుజం: తలపెట్టిన పనులు కలిసివస్తాయి. స్నేహితులు, బంధువులతో వైషమ్యాలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం.
కార్తికం: ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంక్రిమెంట్, బోనస్ అందుకుంటారు. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు.
మార్గశిరం: ఇంటాబయటా సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
పుష్యం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు వస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
మాఘం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఫాల్గుణం: రావలసిన డబ్బు రావడంలో జాప్యం కలుగుతుంది. కొత్త పనుల్లో ఆలస్యం ఉంటుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు.
కుంభం
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం: 8 వ్యయం: 14 రాజపూజ్యం: 3 అవమానం: 5
చైత్రం: గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. కొన్ని విషయాలలో అనుకూలత, కొన్నింటిలో ప్రతికూలత ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మేర లాభాలు పొందలేకపోతారు.
వైశాఖం: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి కార్య నిర్వహణపై మనసు నిలపాలి. ఆస్తి వ్యవహారాల్లో బంధువర్గంతో వివాదాలు తలెత్తుతాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి.
జ్యేష్ఠం: ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు పొందుతారు. కొత్త పనులు వాయిదా పడతాయి. కోర్టు కేసులతో ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ అధికం అవుతుంది.
ఆషాఢం: సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సంఘంలో గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనం వల్ల ఖర్చులు ఉంటాయి. ఆత్మీయులు, స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి.
శ్రావణం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం పొదుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరి సహకారంతో పనులు నెరవేరుతాయి.
భాద్రపదం: ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. ఆత్మీయులతో సంతోషంగా ఉంటారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
ఆశ్వయుజం: ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. అందరితో స్నే హంగా ఉంటూ, పనులు పూర్తి చేసుకుంటారు. భూ వ్యవహారం లాభిస్తుంది.
కార్తికం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల మూలంగా రావలసిన డబ్బు అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పరపతి పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు.
మార్గశిరం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పెద్దల సూచనలు పాటించడం అవసరం.
పుష్యం: ప్రారంభించిన పనులలో జాప్యం ఉంటుంది. స్నేహితులతో మాటపట్టింపులు తలెత్తుతాయి. నెల చివరిలో వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లాభాలు పొందుతారు.
మాఘం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి.
ఫాల్గుణం: ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. ప్రయాణాలతో కార్యసిద్ధి పొందుతారు.
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 3 అవమానం: 11
చైత్రం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. సంయమనంతో పనులు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
వైశాఖం: ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రభుత్వ, రాజకీయ, కోర్టు పనులలో సానుకూలత ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.
జ్యేష్ఠం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వాహనం మూలంగా ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితులు, బంధువుల మూలంగా పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
ఆషాఢం: వృత్తి, వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలపడం మంచిది. దైవ దర్శనంతో ఉపశమనం లభిస్తుంది.
శ్రావణం: ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నూతన ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
భాద్రపదం: ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. సంయమనంతో పనులు చేస్తారు. ఆత్మీయులు, స్నేహితుల కలయిక ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.
ఆశ్వయుజం: కొత్త పనులపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆత్మీయుల సూచనల మేర పనులు చేసి, సత్ఫలితాలను పొందుతారు. నలుగురిలో పరపతిని సంపాదిస్తారు.
కార్తికం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. బంధువుల సహకారం లభిస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు. భూ వ్యవహారము లాభిస్తుంది.
మార్గశిరం: విహార యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
పుష్యం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. భూ వ్యవహారంలో ఇబ్బందులు ఉంటాయి. కళాకారులకు మంచి సమయం.
మాఘం: ఉద్యోగంలో స్థానచలన సూచన. వృత్తి, వ్యాపారాల్లో అనాలోచిత నిర్ణయాల నష్టం ఏర్పడవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
ఫాల్గుణం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు. సంయమనంతో పనులు చేస్తారు. రావలసిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు.
విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ కృష్ణ విదియ బుధవారం తేది: 14-5-2025 రాత్రి 10.36 గంటల వరకు గురువు వృషభంలో ఉంటాడు. 15-5-2025 నుంచి 18-10-2025 వరకు, తిరిగి 6-12-2025 నుంచి సంవత్సరాంతం వరకు గురువు మిథునంలో ఉంటాడు. 19-10-2025 నుంచి 5-12-2025 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తాడు.
ఈ సంవత్సరం అంతా శని మీనంలో ఉంటాడు. ఫలితంగా సస్యహాని, రోగపీడలు తదితర సమస్యలు ఉత్పన్నం అవుతాయి. భూకంపాలు, తుఫానులు ఏర్పడవచ్చు.
ఈ ఉగాది నుంచి 18-5-2025 వరకు రాహువు మీనంలో ఉంటాడు. 19-5-2025 నుంచి సంవత్సరాంతం వరకు కుంభంలో సంచరిస్తాడు.
ఈ ఉగాది నుంచి 18-5-2025 వరకు కేతువు కన్యలో ఉంటాడు. 19-5-2025 నుంచి సంవత్సరాంతం వరకు సింహంలో సంచరిస్తాడు.