Mercury Transit | గ్రహాలకు అధిపతి అయిన బుధుడు నేడు (మే 23న) మధ్యాహ్నం 1.05 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 6 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. విశేషం ఏంటంటే.. బుధుడి సంచారంతో పలురాశుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, గణితం, వ్యాపారానికి అధిపతి. ఆయా రంగాల్లోని వారికి ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. బుధుడు ప్రభావంతో వ్యాపారంలో లాభం, వృత్తిలో విజయం, మంచి మాటతీరు కారణంగా గౌరవ మర్యాదలు పొందుతున్నారు.
మిథునరాశిలోకి బుధుడి సంచారంతో లాభాలుంటాయి. మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆఫీసుల్లో సీనియర్ అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. సహకారం సైతం అందుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. వ్యాపారవేత్తలకు లాభాలుంటాయి. కెరియర్లో మంచి ఫలితాలుంటాయి. ఈ సమయంలో కొత్తగా ఏదైనా పని చేపట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం.
బుధుడి సంచారంతో సింహ రాశి వారికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బుధుడు ప్రభావంతో కెరీర్ సంబంధిత విషయాల్లో నమ్మకం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. పెట్టుబడి, ఆస్తి, విద్యలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. పిల్లల జీవితాల్లోని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారం రంగంలోని నిలిచినపోయిన ప్రణాళిక మళ్లీ కార్యరూపంలోకి తెస్తారు. వారు అనుకున్న విధంగా విజయం సాధించగలుగుతారు.
కుంభ రాశి వారికి తగిన జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది. బుధ సంచారంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు చదువులపై దృష్టి పెడతారు. చదువులకు సంబంధించిన పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. శుభవార్త వినే అవకాశాలున్నాయి. అసంపూర్ణ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారం రంగంలోని వారు పెద్ద ఆర్డర్ లభించే అవకాశం ఉంది.