Ketu Transit | కేతువు నేడు (18న) సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యరాశి నుంచి బయలుదేరి సాయంత్రం 5.08 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో కేతువు గ్రహం రౌద్రానికి ప్రతీకగా పేర్కొంటారు. ఈ గ్రహం ఎప్పుడూ తిరోగమనంలో ఉంటుంది. కేతువు ఓ రాశిలో సంచరించే సమయంలో ఆ రాశిచక్రం పాలక గ్రహం ప్రభావాన్ని పోలి ఉంటుంది. ఈ సారి కేతువు సంచార ప్రభావంతో పలు రాశులవారికి సవాల్‌గా మారుతుంది.
ఈ రాశిచక్రం వ్యక్తులు ఉద్యోగం, వ్యాపారంలో ఆకస్మిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దాంతో పాటు ఆర్థిక పరిస్థితి సైతం ప్రభావితమవుతుంది. ఆర్యోగ సమస్యలు సైతం ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. తద్వారా క్లిష్ట సమయం నుంచి గట్టెక్కవచ్చని పండితులు చెబుతున్నారు. కేతు సంచారం కారణంగా పలు రాశులవారిపై విభిన్న ప్రభావం చూపనున్నది. ఈ గ్రహం తిరోగమనంలో ఉంటుంది. ఏదైనా రాశిలో సంచరించినప్పుడల్లా వారి జీవితాల్లో మార్పులు తేవడంతో పాటు సవాల్‌గా మారుస్తుంది. కేతు సంచారంతో ఏ రాశుల వారిపై ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..!
కేతువు మేష రాశి ఐదో ఇంట్లో ప్రవేశించనున్నాడు. ఈ సంచారం కారణంగా మీరు మానసిక అశాంతి, ఆందోళనకు గురవుతారు. ఈ సమయంలో విద్యార్థులకు కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, వ్యక్తిగత సంబంధాల విషయంలో అపార్థాలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాలలో విభేదాలు ఉండవచ్చు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మోసాలకు దూరంగా ఉండాలి. కేతువు ప్రభావం తగ్గించేందుకు ప్రతి మంగళవారం త్రిభుజాకార జెండాను ఎగురవేయాలి.
కేతువు వృషభ రాశి నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దాంతో కుటుంబ జీవితంలో అశాంతి, ఘర్షణలకు తావిస్తుంది. ఇంట్లో వాతావరణం కొంతవరకు ప్రతికూలంగా మారుతుంది. తల్లి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అలాగే, కుటుంబ బాధ్యతలను చూసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యంపై సైతం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఛాతీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. కేతు ప్రభావం నివారణకు కేతు గ్రహ బీజమంత్రాన్ని జపించండి.
కేతువు సింహ రాశి మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దాంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే, వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు తలెత్తుతాయి. ఎందుకంటే మీ ఆలోచనలకు, మీ జీవిత భాగస్వామి ఆలోచనల మధ్య తేడాలు వస్తాయి. ఈ సమయంలో వ్యాపార విషయాల్లోనూ సవాళ్లు ఎదురవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ రాశి ప్రభావం తగ్గించుకునేందుకు మంగళవారం పిల్లలకు బెల్లం, పప్పు ప్రసాదం పంచిపెడితే కొంత ఉపశమనం ఉంటుంది.
కేతువు కన్య రాశి పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు. మీ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ సమయంలో మీ మనస్సులో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ధ్యానం, సాధన, మతపరమైన కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడపవచ్చు. దాంతో పాటు ఉద్యోగంపై మీ ఆసక్తి తగ్గుతుంది. పరిష్కారంగా కేతువు బీజ మంత్రాన్ని జపించండి.
కేతువు కుంభ రాశి ఏడవ ఇంట్లో ప్రవేశిస్తాడు. మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. మీ మనసులో సందేహాలతో పాటు కోపం పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారులకు కూడా సవాల్‌గా ఉంటుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండడం మంచిది. మంగళవారం నలుపు, తెలుపు నువ్వులను దానం చేయడం శుభప్రదం.