Jupitar Transit | జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. జ్ఞానం, భాగ్యం, ఆధ్యాత్మికత, అభివృద్ధికి కారకుడిగా భావించే గురుడు ఒక రాశి లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి గురుగ్రహం జూన్ 18వ తేదీన అత్యంత శుభప్రదమైన పుష్య నక్షత్రం(Pushya Nakshatra)లోకి ప్రవేశించనుంది. ఈ గోచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోగా.. మరికొన్ని రాశులవారు కీలక నిర్ణయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో పుష్య నక్షత్రాన్ని నక్షత్రాల రాజుగా పేర్కొంటారు. పోషణ, స్థిరత్వం, శ్రేయస్సుకు దీన్ని ప్రతీకగా భావిస్తారు. గురుడు ఈ నక్షత్రంలో సంచరించడం వల్ల విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలతో పాటు కుటుంబ జీవితం, ఆధ్యాత్మిక అభివృద్ధిపై కూడా ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరిస్తోంది. కాబట్టి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లు భావిస్తారు. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశులవారికి ఈ గోచారం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో చూద్దాం..
గురు పుష్య నక్షత్ర ప్రవేశం మేష రాశి వారికి కుటుంబం, గృహ సౌఖ్యానికి సంబంధించిన అంశాల్లో సానుకూల మార్పులను తీసుకురానుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారడంతో పాటు కుటుంబసభ్యులతో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు, గృహ నిర్మాణం లేదా స్థిరాస్తి వ్యవహారాల్లో పురోగతి కనిపించవచ్చు. మానసిక ప్రశాంతత పెరిగి, కుటుంబంతో గడిపే క్షణాలు ఆనందాన్ని అందిస్తాయి.
వృషభ రాశి వారికి తృతీయ భావంలో గురు సంచారం జరగనుంది. దీనివల్ల ఈ రాశివారిలో ధైర్యం, ఆత్మ విశ్వాసాన్ని పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగల సామర్థ్యం పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు, కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. లక్ష్యాలను సాధించాలనే పట్టుదల మరింత బలపడుతుంది.
ద్వితీయ భావంలో గురుగ్రహ సంచారం ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. కుటుంబసభ్యుల మధ్య అనుబంధం బలపడటంతో పాటు భవిష్యత్తు పొదుపు ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. ఆర్థిక భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టే సమయం ఇది.
గురుగ్రహం స్వయంగా కర్కాటక రాశిలో సంచరిస్తుండటం వల్ల ఈ రాశివారికి ప్రత్యేకమైన అనుకూలత కనిపించనుంది. ఆత్మవిశ్వాసంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తిత్వంలో పరిపక్వత, ఆలోచనల్లో స్పష్టత కనిపిస్తుంది. జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.
ద్వాదశ భావంలో గురుగ్రహ ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతారు. విదేశీ విద్య, ప్రయాణాలకు సంబంధించి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ భవిష్యత్తుకు ఉపయోగపడే అనుభవాలను అందించవచ్చు.
ఏకాదశ భావంలో గురు సంచారం లాభదాయకంగా ఉంటుంది. అవకాశాల పరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. స్నేహితులు, ప్రభావవంతమైన వ్యక్తుల సహకారం అందుతుంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ కృషికి తగిన ఫలితం అందే సమయం ఇది.
దశమ భావంలో గురుగ్రహ స్థానం కారణంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ అవే భవిష్యత్తులో గుర్తింపు, గౌరవానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది.
నవమ భావంలో గురు సంచారం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదృష్టం అనుకూలిస్తుంది. ఉన్నత విద్య, విదేశీ విద్య, ధార్మిక యాత్రలకు ఇది అనుకూల సమయంగా చెప్పవచ్చు. గురువుల సలహాలు జీవితంలో కొత్త దారులను చూపించవచ్చు.
అష్టమ భావంలో గురుగ్రహ ప్రభావం జీవితంలో కీలక మార్పులకు కారణం కావచ్చు. లోతైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వారసత్వ లేదా ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
సప్తమ భావంలో గురు సంచారం వైవాహిక జీవితం, భాగస్వామ్య వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. సంబంధాలు మరింత బలపడతాయి. వివాహ యోగం ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు.
షష్ట భావంలో గురుగ్రహ ప్రభావం క్రమశిక్షణను పెంచుతుంది. ఉద్యోగ రంగంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించే సామర్థ్యం పెరుగుతుంది. ఆరోగ్యం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
పంచమ భావంలో గురు సంచారం విద్యార్థులు, కళారంగానికి చెందిన వారికి శుభఫలితాలను ఇస్తుంది. ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతాయి. సృజన్మాతక ఆలోచనలు విజయానికి దారి తీసే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఆనందం, సంతృప్తి పెరుగుతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశిలో ఉచ్చస్థితికి సమానంగా భావించే గురు గ్రహం పుష్య నక్షత్ర ప్రవేశం వల్ల అనేక రాశుల వారికి అభివృద్ది, స్థిరత్వం, ఆర్థిక పురోగతి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా కర్కాటకం, కన్య, తుల, వృశ్చిక, మకరం, మీన రాశుల వారికి ఈ గోచారం మరింత అనుకూల ఫలితాలు అందించే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశా-భుక్తులు, ఇతర గ్రహాల ప్రభావం ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తారంట!