e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News 19-05-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

19-05-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

19-05-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: క‌ళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. కుటుంబ సౌఖ్యం స‌పూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను క‌లుస్తారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు.

వృష‌భం: రుణ‌ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క‌పోవ‌డంతో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధులు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

మిథునం: స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రింప‌బ‌డుతాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ‌వ‌హిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ‌ద‌ర్శనం చేసుకుంటారు. భ‌క్తి శ్రద్ధ‌లు అధిక‌మ‌వుతాయి.

క‌ర్కాట‌కం: ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. వృత్తిరీత్యా గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పొందుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. మ‌నోల్లాసాన్ని పొందుతారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి.

సింహం: ఇత‌రుల‌తో గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. ప్ర‌తి ప‌ని ఆల‌స్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

క‌న్య‌: త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్లో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. మోస‌పోయే అవ‌కాశాలు ఉంటాయి. ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంది. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కూడ‌దు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు.

తుల‌: వృత్తిరీత్యా అనుకూల స్థాన‌చ‌ల‌నం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. పోట్లాట‌ల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మించ‌డానికి ఔష‌ధ‌సేవ త‌ప్ప‌దు. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో తొంద‌ర‌పాటు ప‌నికిరాదు.

వృశ్చికం: కుటుంబ‌మంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదావేసిన ప‌నుల‌న్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్ప‌డుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్య‌వ‌సాయ మూల‌కంగా లాభాల‌ను పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ ఫ‌లిస్తాయి. సూక్ష్మ విష‌యాల‌ను గ్ర‌హిస్తారు.

ధ‌నుస్సు: ఆత్మీయ‌ల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. ప‌్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. అజీర్ణ‌బాధలు అధిక‌మ‌వుతాయి. కీళ్ల‌నొప్పుల బాధ నుంచి ర‌క్షించుకోవ‌డం అవ‌స‌రం. మ‌నోవిచారాన్ని క‌లిగి ఉంటారు.

మ‌క‌రం: ప‌్ర‌యత్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుంతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగజేస్తారు. క‌ళాత్మ‌క వ‌స్తువుల‌ను సేక‌రిస్తారు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు.

కుంభం: కుటుంబంలో చిన్న‌చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. ఆర్థిక ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌డానికి రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. బంధు, మిత్రుల స‌హాయ‌స‌హ‌కారాలు ఆల‌స్యంగా ల‌భిస్తాయి.

మీనం: రుణ‌ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫలిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. శుభ‌కార్యాల మూల‌కంగా ధ‌నవ్య‌యం అధిక‌మ‌వుతుంది. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. అనారోగ్యం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
19-05-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

ట్రెండింగ్‌

Advertisement