మేషం: ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూత కార్యాలు ప్రారంభిస్తారు.
వృషభం: విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథునం: కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
కర్కాటకం: ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
సింహం: రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
కన్య: నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
తుల: నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
వృశ్చికం: ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
ధనుస్సు: విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.
మకరం: బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసరం నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం: గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యవయప్రయాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మీనం: ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868