e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News 12-06-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు

12-06-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. ఇత‌రుల‌కు మంచి స‌ల‌హాలు, సూచ‌నలిస్తారు. సంఘంలో గౌర‌వం పెరుగుతుంది. ధైర్య‌సాహ‌సాల‌తో కొన్ని ప‌నులు పూర్తిచేసుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు.

వృష‌భం: క‌ళాకారుల‌కు, మీడియా రంగాల‌వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తారు. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు.

- Advertisement -

మిథునం: ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేయాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌సరం. అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చ‌వ‌డంతో ఆందోళ‌న చెందుతారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. ఆరోగ్యంపట్ల శ్ర‌ద్ధ‌వహించ‌క త‌ప్ప‌దు.

క‌ర్కాట‌కం: మ‌నోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం అవ‌స‌రం. నూత‌న కార్యాల‌కు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది. క‌ఠిన సంభాష‌ణ‌వ‌ల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇత‌రుల‌కు హాని త‌ల‌పెట్టే కార్యాల‌కు దూరంగా ఉంటారు.

సింహం: కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. గృహంలో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ల‌చిన కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేరుతాయి. కొన్నికార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

క‌న్య‌: స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇత‌రుల‌కు అప‌కారం క‌లిగించే ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ప‌రిశుభ్ర‌త్త‌కు ప్రాధాన్య‌మిస్తే అనారోగ్య బాధ‌లు ఉండ‌వు.

తుల‌: మాన‌సిక ఆందోళ‌న తొల‌గుతుంది. ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్ర‌యాణాల్లో మెల‌కువ అవ‌స‌రం. ప్ర‌య‌త్న‌కార్యాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి.

వృశ్చికం: వృత్తిరీత్యా అనుకూల స్థాన‌చ‌ల‌నం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. పోట్లాట‌ల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మించ‌డానికి ఔష‌ధ‌సేవ త‌ప్ప‌దు. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో తొంద‌ర‌పాటు ప‌నికిరాదు.

ధ‌నుస్సు: కుటుంబ క‌ల‌హాలు దూర‌మ‌వుతాయి. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. వృథా ప్ర‌యాణాల‌వ‌ల్ల అల‌స‌ట చెందుతారు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. అంద‌రితో స్నేహంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వ‌ల్పంగా ఉంటాయి.

మ‌క‌రం: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసే కార్యాల్లో నిమ‌గ్నుల‌వుతారు. స్త్రీల‌మూల‌కంగా లాభం ఉంది. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. రుణ‌బాధ‌లు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగ‌వుతుంది.

కుంభం: ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగ‌జేస్తారు. క‌ళాత్మ‌క వ‌స్తువుల‌ను సేక‌రిస్తారు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు.

మీనం: ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. క్రీడాకారులు, రాజ‌కీయ‌రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana