మేషం
ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలతో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగస్తులకు పనిలో బాధ్యతలు పెరుగుతాయి. నిత్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు గత నిర్ణయాలవల్ల లాభాలు ఉంటాయి. డబ్బు చేతికి అందుతుంది. క్రమంగా ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొన్ని అనవసర ఖర్చులతో ముఖ్యమైన పనులలో జాప్యం ఏర్పడవచ్చు. సమాజంలో మంచిపేరు పొందుతారు. అన్ని రకాలుగా వాతావరణం కలిసివస్తుంది. పిల్లలు, పెద్దలతో హాయిగా గడుపుతారు.
వృషభం
ఉద్యోగస్తులకు ఆఫీసులో సహోద్యోగుల అనుకూలత ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంతో సంతృప్తిగా పనులు చేస్తారు. కొన్ని విషయాలలో ఓపిక అవసరం. అనవసరమైన వివాదాలలో తలదూర్చకుండా ఉండటం మంచిది. పనులను శ్రద్ధతో చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. నిత్య వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. తద్వారా కొన్ని పనులలో ఆలస్యం జరుగుతుంది. ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటారు. వృత్తి, వ్యాపారం సంతృప్తికరంగా, లాభదాయకంగా కొనసాగుతుంది.
మిథునం
ఆలోచించి పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలు పొందుతారు. సమాజంలో మంచివారితో స్నేహం పెంపొందుతుంది. చిన్ననాటి మిత్రులను కలువడంతో సంతోషంగా ఉంటారు. బంధువర్గం సహాయ సహకారాలు లభిస్తాయి. అందరితో ఆప్యాయంగా, ప్రేమపూర్వకంగా ఉంటారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో స్నేహం పెరుగుతుంది. ఆదరణ లభిస్తుంది. పనులు అనుకూలంగా నెరవేరుతాయి. సంతృప్తితో ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేయడంలో శ్రమించవలసి రావచ్చు. ప్రయత్నాలు ఫలించి, శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో జాప్యం ఉండవచ్చు. ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో కొంత జాప్యం జరుగవచ్చు.
కర్కాటకం
ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేపడతారు. నలుగురికి సహాయపడే పనులపై మనసు నిలుపుతారు. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకొంటారు. ఆలోచనలను ఆచరణలో పెడతారు. వృత్తి, వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు, తోటి ఉద్యోగుల నుండి అనుకొన్నమేర సహాయం అందకపోవచ్చు.
సింహం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. సాహిత్య, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. క్రమేపీ ఆదాయం పెరిగి సంతృప్తిగా ఉంటారు. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు. స్థిర, చరాస్తులవల్ల రాబడి పెరుగుతుంది. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనుల ప్రారంభ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో ఖర్చులు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. రోజువారీ వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారంలో సిబ్బందితో కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు రావచ్చు.
కన్య
విద్యార్థులకు అనుకూలమైన వారం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం లభిస్తుంది. సంతోషంతో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఆఫీసులో మంచిపేరు పొందుతారు. పై అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసులు, రాజకీయ పనులవల్ల ఖర్చులు పెరుగవచ్చు. ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఖర్చులుకూడా పెరుగవచ్చు. వివాదాలలోకి వెళ్లకుండా మనసు నిలిపి పనులు చేస్తారు. ఇంటి వాతావరణం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబపెద్దల సహకారం పొందుతారు. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల సూచనల మేరకు పనులు చేస్తారు.
తుల
బంధుమిత్రులను కలుస్తారు. పనులు నెరవేరుతాయి. సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. పనులు పూర్తి చేయడంలో శ్రమించవలసి రావచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. స్థిర, చరాస్తులవల్ల ఆదాయం వస్తుంది. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. పెద్దవారి సహకారం లభిస్తుంది. మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పై చదువుల యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలపై తొందరపాటు విడనాడి సంయమనంతో ఉండటం అవసరం.
వృశ్చికం
ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అధికారుల సహకారం లభిస్తుంది. పనులు పూర్తి చేయడానికి శ్రమించవలసి రావచ్చు. అయినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. పెద్దల విషయంలో భక్తితో ఉంటూ పనులు పూర్తి చేసుకుంటారు. ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ, రాజకీయ పనులలో ఖర్చులు పెరుగవచ్చు. అయినా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. సమస్యలను సంయమనంతో పరిష్కరించుకుంటారు. సమాజంలో స్నేహ సంబంధాలు పెరుగుతాయి.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ప్రారంభించిన పనులలో కొంత జాప్యం జరిగినా అనుకూల ఫలితాలు ఉంటాయి. పనులలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. బంధుమిత్రులను కలుసుకోవడంతో ఖర్చులు పెరిగినా పనులు పూర్తవుతాయి. వాహనాలవల్ల ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పాత పనులను పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆదాయంలో కొంత అస్థిరత ఉన్నా సంతృప్తిగానే ఉంటారు. ముఖ్యమైన పనులలో జాప్యం జరుగవచ్చు. ఆరోగ్యంగా ఉంటూ, సంతృప్తిగా పనులను చేసుకుంటూ వెళతారు.
మకరం
ప్రారంభించిన పనులు అనుకొన్న సమయంలో పూర్తి చేస్తారు. సోదరులు, స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. సంతృప్తిగా ఉంటూ, ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందినా, పనులు పూర్తవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరమైన సమస్యలను అధిగమిస్తారు. వృత్తిలో సిబ్బంది సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. శుభకార్యాలు చేస్తారు. ఆఫీసులో పై అధికారులతో స్నేహ పూర్వకంగా ఉంటూ పనులు నెరవేర్చుకొంటారు. అందరి ఆదరణ లభిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది.
కుంభం
ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. సంగీత, సాహిత్య రంగాల కళాకారులకు క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గురుభక్తి పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి నలుగురి సహాయం లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. ఆఫీసులో తోటి ఉద్యోగస్తుల సహాయ
సహకారాలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. పట్టుదలతో పనులు చేస్తారు. సోదరులు, స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి.
మీనం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరుగవచ్చు. స్థిర, చరాస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో సంతృప్తిగా ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కొత్త పెట్టుబడులపై మనసు నిలుపుతారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సంతృప్తిగా ఉంటారు. పెట్టుబడుల నుండి ప్రతిఫలం లభిస్తుంది. అందరి సహకారాన్ని పొందుతారు. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in