ఆరోగ్య చక్రం!
పురాతనమైన యోగాకు తాడు ముక్కను జోడించి రోప్ యోగా అన్నారు. దిండును జతచేసి పిల్లో యోగా అన్నారు. తాజాగా చక్రాన్ని తీసుకొచ్చారు. ఫిట్నెస్ నిపుణుల తాజా సిఫారసు.. ‘వీల్ యోగా’. దీంతో ఒంటికి మరింత శక్తి చేకూరుతుందని భరోసా ఇస్తున్నారు. నాణ్యమైన సింథటిక్ రబ్బరు ఫోమ్తో ఈ చక్రాన్ని తయారు చేస్తారు.
పురాతనమైన యోగాకు తాడు ముక్కను జోడించి రోప్ యోగా అన్నారు. దిండును జతచేసి పిల్లో యోగా అన్నారు. తాజాగా చక్రాన్ని తీసుకొచ్చారు. ఫిట్నెస్ నిపుణుల తాజా సిఫారసు.. ‘వీల్ యోగా’. దీంతో ఒంటికి మరింత శక్తి చేకూరుతుందని భరోసా ఇస్తున్నారు. నాణ్యమైన సింథటిక్ రబ్బరు ఫోమ్తో ఈ చక్రాన్ని తయారు చేస్తారు. దీనితో యోగా చేస్తున్నప్పుడు నడుము, కీళ్లు తదితర భాగాలకు కొత్త ఉత్తేజం వస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును వదిలించుకోవాలని అనుకునేవారికి చక్కని పరిష్కారం. వెన్నునొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. నచ్చిన రంగుల్లో యోగా వీల్స్ అందుబాటులో ఉన్నాయి. రాగిరేకుల చక్రాలకు ప్రత్యేక శక్తి ఉంటుందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ఈ చక్రం సాయంతో దాదాపు అన్ని యోగ భంగిమలనూ సాధన చేయవచ్చు. కాకపోతే, నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి.


Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

