ఆ నొప్పి తగ్గేదెలా?
మీరు చెప్పినదాన్ని బట్టి ఎండోమెట్రియాసిస్గా భావించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతినెలా బిడ్డ పెరుగుదలకు అనుకూలంగా గర్భాశయం అంచుల వెంట ఒక పొర ఏర్పడుతుంది.
మేడమ్! నా వయసు 32 సంవత్సరాలు. నెలసరికి రెండు మూడు రోజుల ముందునుంచీ కుడివైపు పొత్తికడుపులోవిపరీతంగా నొప్పి వస్తుంది. వచ్చిన ప్రతిసారీ అరగంట సేపు నరకం అనుభవిస్తాను. ఆ తర్వాత క్రమంగా అదే తగ్గిపోతుంది. నాకు పెండ్లయి నాలుగు నెలలు అవుతున్నది.
పీరియడ్స్‌కు ముందు వారం రోజుల నుంచీ కలయిక తర్వాత కూడా పొత్తికడుపు నొప్పి విపరీతంగా వేధిస్తున్నది. పెళ్లికి ముందే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాను. స్కాన్ తీసి ఏ ఇబ్బందీ లేదన్నారు. మందులు కూడా ఇవ్వలేదు. కానీ ఇంకా నొప్పి తగ్గలేదు. నా బాధ తీరే మార్గం ఉందా? -ఓ సోదరి
మీరు చెప్పినదాన్ని బట్టి ఎండోమెట్రియాసిస్గా భావించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతినెలా బిడ్డ పెరుగుదలకు అనుకూలంగా గర్భాశయం అంచుల వెంట ఒక పొర ఏర్పడుతుంది. దాన్ని ఎండోమెట్రియం అని పిలుస్తారు. ఆ నెల విడుదలైన అండం ఫలదీకరణ చెందకపోతే.. ఈ పొర విచ్ఛిన్నమై బయటికి వచ్చేస్తుంది. అదే నెలసరి. అయితే గర్భాశయంలో ఏర్పడాల్సిన ఈ పొర కొందరిలో గర్భాశయం బయట, అండాశయంలో, మూత్రాశయంలో.. ఇలా వేరేచోట ఏర్పడుతుంది. నెలసరి సమయంలో వచ్చే హార్మోన్ల తేడాలకు ఇది కూడా స్పందిస్తుంది. కానీ ఇది గర్భాశయం అంచుల దగ్గర ఏర్పడలేదు కాబట్టి దానిలా బయటికి వచ్చే అవకాశం ఉండదు. అందుకే నెలసరి సమయంలో శరీరాన్ని బాధిస్తుంది. కొన్నిసార్లు పిల్లలు కలగడానికి అడ్డంకిగా కూడా మారవచ్చు. ఎండోమెట్రియాసిస్ను పూర్తిస్థాయిలో తగ్గించలేం. కాకపోతే కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఇబ్బందిని తగ్గించేందుకు కొన్ని చికిత్సలు చేయవచ్చు. మీరు ఇంతకుమునుపే డాక్టరును సంప్రదించానని చెప్పారు. అయితే పూర్తిస్థాయిలో పరీక్షలు చేయలేదని అర్థం అవుతున్నది. మరొకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. పరీక్షలు నిర్వహించి ఓ పరిష్కారం సూచిస్తారు.
-డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

