Health Tips | ఇలా చేస్తే మీ గుండె పదిలంగా ఉంటుంది.. మీరూ ట్రై చేస్తారా ?
Health Tips | గుండెకు బలాన్నిచ్చే ఆహారానికి మీ పళ్లెంలో చోటివ్వండి. యోగర్ట్, జీలకర్ర, మష్రూమ్స్, డార్క్ చాక్లెట్, విటమిన్-సి ఉన్న పదార్థాలు తరచూ తీసుకోండి.
Health Tips | గుండె బావుంటేనే మనిషి బావున్నట్టు. గుండె స్పందనలు మారితే ఆరోగ్యానికి అవాంతరాలే. ఆహారం, జీవనశైలి, పాజిటివ్ దృక్పథం గుండె రక్షణ కవచాలు. వరల్డ్ హార్ట్ డే నాడు ఆ పిడికెడు నేస్తానికి కొండంత భరోసా ఇద్దాం..

- గుండెకు బలాన్నిచ్చే ఆహారానికి మీ పళ్లెంలో చోటివ్వండి. యోగర్ట్, జీలకర్ర, మష్రూమ్స్, డార్క్ చాక్లెట్, విటమిన్-సి ఉన్న పదార్థాలు తరచూ తీసుకోండి.
- నిపుణుల సలహాతో బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, టెన్నిస్.. తదితర వ్యాపకాలకు సమయం కేటాయించండి.
- ఏదో ఓ సామాజిక బాధ్యత తీసుకునేవారి గుండె, మిగిలినవారితో పోలిస్తే ఆరోగ్యంగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒంటరితనం, నిరాశావాదం, నెగెటివ్ ధోరణి గుండెకు శత్రువులు.
- విటమిన్-డి కొరతకు, గుండె సమస్యలకు సంబంధం ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. కాబట్టి, తరచూ సూర్యకిరణాల్ని ఆస్వాదించండి.
- ప్రశాంతమైన నిద్ర గుండెకు సత్తువనిస్తుంది. రోజూ కనీసం ఏడుగంటల నిద్ర తప్పనిసరి. నిద్రలేమిని తేలిగ్గా తీసుకోకండి.
- పొటాషియమ్, మెగ్నీషియం.. గుండెకు రక్షణ కవచాలు. ఈ రెండూ లభించే ఆహార పదార్థాల్ని విస్మరించకండి.
- నాలుగుపదులు దాటగానే.. ఏడాదికి ఒకసారైనా సంపూర్ణ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
- జన్యుశాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. వారసత్వంగా వచ్చే అనారోగ్యాల గురించి కచ్చితమైన హెచ్చరికలూ చేస్తున్నది. కాబట్టి, కుటుంబ ఆరోగ్య చరిత్ర తెలుసుకోడానికి ఓ సారి జన్యు పరీక్షలు చేయించుకోండి. కొందరిలో గుండెపోటు కూడా పారంపర్యమే.
- ఇప్పటికే ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నట్టయితే.. గుండెను మరింత జాగ్రత్తగా కాపాడు
కోవాల్సిన అవసరం ఉందని అర్థం. - కాళ్లు, పాదాలు, మడమలు వాపునకు గురవుతుంటే గుండె జబ్బుకు సంకేతంగా అర్థం చేసుకోవాలి. తీవ్ర నిస్సత్తువనూ విస్మరించలేం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

