Migraine | మైగ్రేన్‌ను తగ్గించడంలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న చిట్కాలు నిజంగానే పనిచేస్తాయా..?
మైగ్రేన్ తలనొప్పి ప్రస్తుతం అన్ని వయసుల వారిలో కనిపిస్తున్న సాధారణ నాడీ సంబంధిత సమస్యల్లో ఒకటిగా మారింది. కొందరిలో ఇది అప్పుడప్పుడు వస్తే, మరికొందరిని తరచూ వేధిస్తోంది. మైగ్రేన్ వచ్చినప్పుడు రోజువారీ పనులు కూడా కష్టంగా మారిపోతాయి. దీంతో ఉపశమనం కోసం సోషల్ మీడియాలో కనిపించే అనేక చిట్కాలను పాటిస్తుంటారు.
Migraine | మైగ్రేన్ తలనొప్పి ప్రస్తుతం అన్ని వయసుల వారిలో కనిపిస్తున్న సాధారణ నాడీ సంబంధిత సమస్యల్లో ఒకటిగా మారింది. కొందరిలో ఇది అప్పుడప్పుడు వస్తే, మరికొందరిని తరచూ వేధిస్తోంది. మైగ్రేన్ వచ్చినప్పుడు రోజువారీ పనులు కూడా కష్టంగా మారిపోతాయి. దీంతో ఉపశమనం కోసం సోషల్ మీడియాలో కనిపించే అనేక చిట్కాలను పాటిస్తుంటారు. అయితే వాటిలో అన్నీ ప్రభావవంతంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ తీవ్రత వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అందువల్ల దానికి అనుగుణంగా సరైన చికిత్స లేదా ఉపశమన మార్గాలను ఎంచుకోవడం అవసరం. నాడీ సంబంధిత నిపుణులు ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని సాధారణ చిట్కాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. నాలుక కింద ఉప్పు పెట్టుకోవడం ద్వారా మైగ్రేన్ తగ్గుతుందనే నమ్మకం కొందరిలో ఉంది. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉప్పు రుచి వల్ల క్షణికంగా దృష్టి మరలినా, మైగ్రేన్ నొప్పిని తగ్గించే శారీరక ప్రభావం దీనికి లేదని చెబుతున్నారు. అందువల్ల ఈ పద్ధతిని ఉపయోగకరమైందిగా పరిగణించడం లేదు.
కనుబొమ్మలపై హెయిర్‌క్లిప్స్..
కనుబొమ్మలపై హెయిర్ క్లిప్స్ పెట్టుకోవడం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది కొంతమందిలో తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్‌కు సంబంధం ఉన్న ట్రైజెమినల్ నర వ్యవస్థపై దృష్టి మరల్చే ప్రభావం వల్ల తేలికపాటి నొప్పిలో కొద్దిసేపు ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని, ఎక్కువ ఒత్తిడి వల్ల గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఐస్ ప్యాక్స్ లేదా కోల్డ్ క్యాప్ ఉపయోగించడం మైగ్రేన్ సమయంలో కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి. చల్లదనం రక్తనాళాలను సంకోచింపజేసి నొప్పి ఉన్న ప్రాంతాన్ని తాత్కాలికంగా మొద్దుబార్చుతుంది. దీంతో తేలికపాటి మైగ్రేన్ దశలో త్వరితగతిన ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ వచ్చినప్పుడు చీకటి, నిశ్శబ్ద గదిలో విశ్రాంతి తీసుకోవడం వైద్యులు తరచూ సూచించే పద్ధతి. కాంతి, శబ్దం మైగ్రేన్ లక్షణాలను మరింత తీవ్రతరం చేసే అంశాలుగా గుర్తించారు. అందువల్ల వాటి నుంచి దూరంగా ఉంటే తలనొప్పి మరింత పెరగకుండా నివారించవచ్చు. కొన్నిసార్లు మోస్తరు తీవ్రత ఉన్న మైగ్రేన్ కూడా విశ్రాంతితో తగ్గే అవకాశం ఉంటుంది.
కాఫీ తాగడం..
కాఫీ తాగడం కూడా చాలామంది అనుసరించే మరో చిట్కా. కెఫిన్ ను కొన్ని మైగ్రేన్ మందుల్లో భాగంగా ఉపయోగిస్తారు. ఇది మెదడులోని రక్తనాళాలను సంకోచింపజేసి, నొప్పి నివారణ మందుల ప్రభావాన్ని పెంచుతుంది. అందువల్ల ఆకస్మిక మైగ్రేన్ దాడి సమయంలో కొంతమందికి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా పనిచేయదు. కొందరిలో కెఫిన్ మైగ్రేన్‌ను ప్రేరేపించే అవకాశమూ ఉంటుంది. మైగ్రేన్ చికిత్సలో అత్యంత ప్రభావవంతమైన మార్గంగా సరైన సమయంలో సరైన మోతాదులో వైద్యుల సూచన మేరకు నొప్పి నివారణ మందులు తీసుకోవడాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రారంభ దశలోనే మైగ్రేన్‌ను సమర్థంగా నియంత్రించడం వల్ల భవిష్యత్తులో దాని తీవ్రత, తరచూ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. మైగ్రేన్ దాడులను నిర్లక్ష్యం చేయడం లేదా సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల కాలక్రమేణా ఎపిసోడిక్ మైగ్రేన్ దీర్ఘకాలిక మైగ్రేన్‌గా మారే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తరచూ మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు స్వయంగా చిట్కాలపై ఆధారపడకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. మైగ్రేన్‌కు సంబంధించిన వైరల్ చిట్కాల్లో కొన్ని తాత్కాలిక ఉపశమనం ఇవ్వగలిగినా, సరైన వైద్య చికిత్సకు అవి ప్రత్యామ్నాయం కావు. లక్షణాల తీవ్రతను బట్టి సరైన చికిత్స పొందడం ద్వారా మైగ్రేన్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Migraine
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

