Diabetes and Smoking | సిగరెట్ స్మోకింగ్ డయాబెటిస్‌ను ప్రభావితం చేస్తుందా..? ఈ విషయాలు తెల్సుకోండి..!
Diabetes and Smoking | సిగరెట్ స్మోకింగ్ వ్యసనంలా మారింది. యువతలో ఈ అలవాటు మరీ ఎక్కువైంది. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
Diabetes and Smoking | సిగరెట్ స్మోకింగ్ ఒక వ్యసనం. పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయన పదార్థం మనకు ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వివిధ క్యాన్సర్లు, గుండె సంబంధ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. గర్భంతో ఉన్న మహిళలు సిగరెట్ స్మోకింగ్ చేసినట్లయితే పుట్టబోయే సంతానం లోపాలతో ఉండే అవకాశాలు ఉంటాయిని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలున్నాయి. స్మోకింగ్ అలవాటు లేని వారి కన్నా అలవాటున్నవారిలో 30-40 శాతం ఎక్కువగా డయాబెటిస్ వస్తుందని పలు పరిశోధనలు తేల్చాయి. ఇప్పటికే మధుమేహం ఉన్నట్లయితే సిగరెట్ స్మోకింగ్ రక్తంలో చక్కెరల స్థాయిని నియంత్రించడం మరీ కష్టతరం చేస్తుంది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.
సిగరెట్లలో ఉండే నికోటిన్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెర కణాల్లోకి ప్రవేశించడంలో సహాయపడే ఇన్సులిన్.. నికోటిన్ కారణంగా ప్రభావితమవుతుంది. మధుమేహం ఉన్నవారు సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించేందుకు తరచుగా ఎక్కువ ఇన్సులిన్ మోతాదులు తీసుకోవాల్సి వస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు గుండె చుట్టూ ఉన్న రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తాయి.
సిగరెట్‌లోని రసాయనాలుశరీర కణాలకు హానికరం కలిగిస్తాయి. చివరికి కణాలు కూడా ఇన్సులిన్‌కు ప్రతిస్పందించవు. దీంతోపాటు సిగరెట్ స్మోకింగ్ బొడ్డు చుట్టూ కొవ్వును పెంచుతుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందని గుర్తించాలి. ధూమపానంతో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి.. మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ధూమపానం రక్తంలో కొవ్వుల మాదిరి ట్రైగ్లిజరాయిడ్లను పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్లు టీ2డీ లింక్‌ను కలిగి ఉంటాయి. సిగరెట్ స్మోకింగ్ కారణంగా గుండె సంబంధ సమస్యలతోపాటు కంటి సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, స్ట్రోక్, న్యూరోపతి, ఎరక్టైల్ డిస్ఫంక్షన్, నిద్రలేమి తదితర సమస్యలు వస్తుంటాయి.
ధూమపానం మానుకోవడం మధుమేహ సమస్యలను దూరం చేయడమే కాకుండా మొత్తం ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తుంది. స్మోకింగ్‌ను మానుకోవటం అంత సులభమేం కాదు. మరీ ముఖ్యంగా చాలా కాలంపాటు అలవాటుగా ఉన్న వారిలో ఇదీ మరీ కష్టం. స్మోకింగ్ మనుకోగానే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్ధవంతంగా నిర్వహించుకోవడమే కాకుండా శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
సిగరెట్ స్మోకింగ్‌తో మరికొన్ని హానికర ప్రభావాలు..
ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
దృష్టి సమస్యలు వస్తాయి. గ్లకోమా, కంటిశుక్లం ఏర్పడుతుంది.
మెనోపాజ్ సమస్యలు వస్తాయి.
రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.
బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చేలా చేస్తుంది.
ఆయుర్ధాయాన్ని తగ్గిస్తుంది.
చిగుళ్ల వ్యాధులు, దంతాల సున్నితత్వం, దంతాలు ఊడిపోతుంటాయి.
చెవికి రక్త సరఫరా తగ్గించి వినికిడిని ప్రభావితం చేస్తుంది.
సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది.
స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

