స్పిరులినా. ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసు. ఇంతకీ ఏంటిది అంటారా ? సముద్రపు నీటిలో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క . ఇది సయానో బ్యాక్టీరియా జాతికి చెందింది. దీన్ని ఆకుపచ్చ ఆల్గే అని కూడా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో ఈ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకు కారణం ఆరోగ్య దాయిని కావడమే.
స్పిరులినాలో శరీరానికి, మెదడుకు మేలు చేసే వివిధ యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉన్నాయి. అందుకే పోషకాహార నిపుణులు రోజువారీ ఆహారంలో స్పిరులినాను చేర్చమని సలహా ఇస్తున్నారు. దీన్ని ప్రతి రోజూ 1 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు.
స్పిరులినాలో పౌడర్లో విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, బి 12, కాపర్, ఐరన్, పిండి పదార్థాలు వంటి పోషకాలుంటాయి. రక్తపోటు, రక్తహీనత ,చెడు కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుంది. క్యాన్సర్ నియంత్రిస్తుంది . ఇది ట్యాబెట్, పౌడర్ రూపంలో కూడా లభిస్తుంది కాబట్టి డాక్టర్ల సలహా మేరకు తీసుకోవడం మంచిది.