Acne | మొటిమలు అసలు ఎందుకు వస్తాయి..? అవి ఏర్పడేందుకు కారణాలు ఏమిటి..?
మొటిమలు (Acne) అనేది సాధారణంగా కనిపించే చిన్న సమస్యలా అనిపించినా, చాలా మందికి ఇది దీర్ఘకాలిక చర్మ సమస్యగా మారి వారి నిత్యజీవితం, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. చర్మ రంధ్రాలు (పోర్స్) అధిక ఆయిల్, మృత కణాలు, బ్యాక్టీరియాతో మూసుకుపోవడం వల్ల మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ ఏర్పడతాయి.
Acne | మొటిమలు (Acne) అనేది సాధారణంగా కనిపించే చిన్న సమస్యలా అనిపించినా, చాలా మందికి ఇది దీర్ఘకాలిక చర్మ సమస్యగా మారి వారి నిత్యజీవితం, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. చర్మ రంధ్రాలు (పోర్స్) అధిక ఆయిల్, మృత కణాలు, బ్యాక్టీరియాతో మూసుకుపోవడం వల్ల మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ ఏర్పడతాయి. ఇవి ముఖం, ఛాతీ, వెన్నుపై ఎక్కువగా కనిపిస్తాయి. యువతలో హార్మోన్ మార్పుల వల్ల ఇది ఎక్కువగా కనిపించినా, పెద్దవారిలో కూడా కొనసాగుతుంది. అయితే మొటిమలు కేవలం స్కిన్‌కేర్ సమస్య మాత్రమే కాకుండా, శరీరంలో లోపల జరిగే మార్పుల ఫలితం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొటిమలు బయట కనిపించే ముందు లోపలే ప్రారంభమవుతాయి. చర్మం సమస్య చూపడం అంటే అది శరీరం పంపించే హెచ్చరిక సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. ఇక మొటిమలు రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అధిక ఇన్సులిన్ స్థాయిలు..
మొదటిది ఇన్సులిన్ స్థాయిల పెరుగుదల. అధిక చక్కెర, రిఫైన్డ్ కార్బ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరుగుతుంది. దీంతో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి IGF-1 హార్మోన్ పెరుగుదలకి దారితీస్తుంది. ఇది సెబమ్ (ఆయిల్) ఉత్పత్తిని పెంచి, పోర్స్ మూసుకుపోయి మొటిమలకు కారణమవుతుంది. వైట్ బ్రెడ్, పాస్తా, స్వీట్స్, షుగర్ డ్రింక్స్ వంటి ఆహారాలు, తక్కువ ప్రోటీన్ తీసుకోవడం, ఒత్తిడి వంటి అంశాలు దీనికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. రెండవది ఆండ్రోజెన్ హార్మోన్ల అసమతుల్యత. ఈ హార్మోన్లు సెబేసియస్ గ్రంథులను ఉత్తేజపరిచి అధిక ఆయిల్ ను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా మొటిమలు పెరుగుతాయి. నిద్రలేమి, PCOS/PCOD, ప్రాసెస్డ్ ఫుడ్స్, అసమాన మానసిక చక్రం వంటి కారణాలు దీనికి దారితీస్తాయి.
జీర్ణ వ్యవస్థలో సమస్యలు..
మూడవది గట్ ఇంబ్యాలెన్స్. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) పెరిగి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, ఫుడ్ ఇంటాలరెన్స్, తరచుగా యాంటీబయోటిక్స్ వాడటం వంటి కారణాలు గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మొటిమలకు కారణమవుతాయి. నాలుగవది మైక్రోన్యూట్రియెంట్ లోపాలు. కొన్ని పోషకాలు చర్మ ఆరోగ్యానికి కీలకం. ఐరన్ లోపం వల్ల చర్మం వెలవెలబోయి కనిపిస్తుంది. జింక్ లోపం వల్ల మొటిమలు ఎక్కువకాలం తగ్గవు. విటమిన్ ఎ చర్మ కణాల పునరుత్పత్తికి అవసరం, దీని లోపం వల్ల పోర్స్ మూసుకుపోతాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని రక్షించి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇవి తక్కువగా ఉంటే చర్మ సమస్యలు పెరుగుతాయి. ఇలా మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయని, మొటిమలు కేవలం బయటికి కనిపించే సమస్య కాదని, శరీరంలో లోపల జరిగే మార్పులకు సంకేతమని నిపుణులు తెలియజేస్తున్నారు. సరైన ఆహారం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ, హార్మోన్ల సమతుల్యతపై దృష్టి పెట్టడం ద్వారా మొటిమలను నియంత్రించడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Acne
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

