WHO | ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్కు చెక్ పెట్టేందుకు భారత్ చొరవ : డబ్ల్యూహెచ్ఓ
ఆహార సరఫరాల్లో ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు లేకుండా చూసేందుకు భారత్ చర్యలు చేపడుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) పేర్కొంది.
న్యూఢిల్లీ : ఆహార సరఫరాల్లో ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు లేకుండా చూసేందుకు భారత్ చర్యలు చేపడుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) పేర్కొంది. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్లాండ్ దేశాలు ఈ విషయంలో చూపుతున్న చొరవతో 170 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్ తెలిపారు.
2025 నాటికి ప్రాధమిక ఆరోగ్య సంరక్షణలో బీపీ, మధుమేహం సమర్ధంగా నియంత్రించేందుకు జాతీయ లక్ష్యాలను నిర్దేశించుకున్నాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేపట్టిన సీహార్ట్స్ కార్యక్రమంలో భాగంగా ఆగ్నేయాసియా దేశాలు లక్ష్యం దిశగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్టెన్షన్, మధుమేహం నియంత్రణ కోసం పొగాకు వాడకం, ఉప్పు తగ్గించడం, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వాడకం నిలిపివేత వంటి చర్యలతో ముప్పు కారకాలను నివారించే ప్రయత్నం పెద్ద ఎత్తున సాగుతోందని అన్నారు.
ఈనెల 29న వరల్డ్ హార్ట్ డే నేపధ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఈ ప్రకటన చేశారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ దాని భాగస్వాములు హృద్రోగాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

