న్యూయార్క్ : కరోనా వైరస్ తాజా వేరియంట్ వ్యాప్తి ఆందోళనల నేపధ్యంలో పలు దేశాలు ప్రయాణాలపై విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. B.1.1.529 వేరియంట్ ప్రభావాన్ని మదింపు చేసేందుకు కొద్ది వారాల సమయం పడుతుందని పేర్కొంది. తాజా స్ట్రెయిన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఐరోపా దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల రాకపోకలను నిషేధిస్తున్న క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాఖ్యలు చేసింది.
నూతన స్ట్రెయిన్‌ను నిలువరించేందుకు ప్రయాణ ఆంక్షలు విధించే విషయంలో శాస్త్రీయ ధోరణితో నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.ప్రయాణ నియంత్రణలకు బదులుగా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు కరోనా తాజా స్ట్రెయిన్ ఒమిక్రాన్ డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందుతూ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇంకా వెల్లడికాలేదని పేర్కొంది.