న్యూఢిల్లీ : శారీరక వ్యాయామంలో నడక చాలా ఆరోగ్యకరమైనదని (Health Tips) చెవుతుంటారు. తేలికపాటి వ్యాయామంగా పరిగణించే వాకింగ్‌తో గుండె ఆరోగ్యం మెరుగవడమే కాకుండా కండరాల బలోపేతమవడం, బరువు తగ్గడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
నిత్యం వాకింగ్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు మూడ్ మెరుగవుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వింటర్లోనూ వాకింగ్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.
వాకింగ్‌తో క్యాలరీలను ఖర్చు చేయడంతో పాటు రోగనిరోధక వ్యవస్ధ కూడా మెరుగవుతుంది. ఇక రోజూ నడకతో ఈ ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
కుంగుబాటు, ఆందోళన దూరం
ఇమ్యూనిటీ బలోపేతం
బరువు తగ్గుదల
బీపీ నియంత్రణ
తగ్గనున్న హృద్రోగ ముప్పు
అధిక రక్తపోటు తగ్గుముఖం
ఊపిరితిత్తుల పనితీరు మెరుగు
ఎముకల ఆరోగ్యం
కండరాల బలోపేతం
మెదడు పనితీరు మెరుగుదల
విటమిన్ డీ లెవెల్స్ పెరుగుదల
Read More :