ఆ రహస్య భాగంపై అశ్రద్ధ మహిళలకు ప్రమాదకరం
Vaginal health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఎందుకంటే సమస్య ఏ భాగంలో ఉన్నా
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఎందుకంటే సమస్య ఏ భాగంలో ఉన్నా మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో లేనట్లే. సిగ్గు, బిడియం లాంటి కారణాల వల్ల కొందరు జననాంగాల గురించిన చర్చను ఇష్టపడరు. దానివల్ల వాటి ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన లేక అశ్రద్ధ చేస్తారు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో ఇబ్బందులు పడుతారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి జననాంగాల ఆరోగ్యం విషయంలో మహిళలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం..
1. జననాంగం శుభ్రతలో అశ్రద్ధ
– కొందరు రహస్య భాగాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఇది రకరకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి ఆ భాగం శుభ్రతలో అశ్రద్ధ చేయకూడదు.
2. క్లీనింగ్‌కు పరికరాలు వాడటం
– కొందరు తమ జననాంగం శుభ్రం చేసుకోవడానికి చేతులను కాకుండా ఇతర పరికరాలను ఉపయోగిస్తారు. ఇది కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇలా పరికరాలతో జననాంగాన్ని శుభ్రం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే మంచి బ్యాక్టీరియా నశిస్తుందట.
3. చెమట దుస్తులతో ఉండటం
– చెమటపట్టిన దుస్తులతో ఎక్కువ సేపు ఉండటం కూడా ప్రమాదకరం. దీనివల్ల జననాంగానికే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నది.
4. సొంత చికిత్సలు
– జననాంగంలో ఏదైన సమస్య తలెత్తితే కొందరు నిపుణులను సంప్రదించడానికి సంకోచిస్తారు. అందుకే తమకు తోచిన సొంత వైద్యం చేసుకుంటారు. ఇలాంటి సొంత చికిత్సవల్ల మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
5. సంకేతాలను ఖాతరు చేయకపోవడం
– కొందరు జననాంగంలో సమస్య కనిపంచినా పట్టించుకోరు. వైద్యులను సంప్రదించి చికిత్స పొందడానికి సందేహిస్తారు. దీనివల్ల సమస్య మరింత ముదిరి ఎక్కువ ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది.
6. శానిటరీ ప్యాడ్స్‌ను మార్చకపోవడం
– పీరియడ్స్ సమయంలో శానిటరీ నాప్కిన్స్ వాడుతారు. కానీ కొందరు వాటిని సమయానికి మార్చరు. ఇలా నాప్కిన్స్ను ఎప్పటికప్పుడు మార్చకుండా ఎక్కువ సమయం ఉపయోగించడంవల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ఆ నాలుగు రోజులు ప్రతి నాలుగు గంటలకు ఒక శానిటరీ ప్యాడ్ మార్చడం శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు.
7. తరచూ పరీక్షలు చేయించకపోవడం
– మహిళలు కనీసం ఏడాదికి రెండు సార్లయినా గైనకాలజిస్టును సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల సమస్య చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి జాగ్రత్తపడే అవకాశం ఉంది.
8. సింథటిక్ లోదుస్తుల వాడకం
– సింథటిక్ లోదుస్తుల వాడకం జననాంగాల ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే సింథటిక్ దుస్తులు చెమటను పీల్చుకోవు. దాంతో అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.
9. ఘాటువాసన వెదజల్లే ఉత్పత్తుల వినియోగం
– శరీర శుభ్రతకు వినియోగించే కొన్ని రకాల సబ్బులు, లోషన్లు కూడా జననాంగ అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆ భాగాల్లోని పీహెచ్ స్థాయిలు మారిపోయి ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు.
గుప్పెడు గింజలతో నిత్య యవ్వనం సొంతం..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

