న్యూఢిల్లీ : మనం ఏ ఆహారం తీసుకుంటామనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఏం తింటున్నామో ఓసారి పరిశీలించి అవసరమైతే ఆహారంలో మార్పులు చేసుకుని హృద్రోగాల బారినుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరు ఆహార అలవాట్లతో గుండె పోటు ముప్పు నివారించవ్చని పోషకాహార, జీవనశైలి నిపుణులు అరూషి గార్గ్ చెబుతున్నారు.
మైండ్‌ఫుల్ ఈటింగ్ కీలకమని చిప్స్, బిస్కెట్లు వంటి చిరు తిళ్ల అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఉప్పు, చక్కెర బీపీ పెరిగేందుకు ఆపై గుండె సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ప్రాసెస్డ్ ఆహారానికి దూరం కావాలని చెబుతున్నారు. కాఫీ, టీల్లోనూ ఉండే అధిక క్యాలరీలు రక్త నాళాలపై ఒత్తిడి పెంచుతాయని చెప్పారు. వీటిని మితంగా తీసుకోవాలని గార్గ్ సూచించారు. ఇక వారానికి ఒక రోజు కేవలం తాజా పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలతో పాటు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. గుండె ఆరోగ్యం కోసం ఈ ఆరు ఆహార సూత్రాలను పాటించాలని గార్గ్ పేర్కొన్నారు.
మైండ్‌ఫుల్ ఈటింగ్
అధిక ఉప్పు, చక్కెరకు దూరం
ఆహారంలో ఒమెగా-3 తీసుకోవడం
తగినంత నీరు
టీ, కాఫీ, కూల్‌డ్రింక్‌లు తగ్గించాలి
వారానికి ఒకసారి డీటాక్సిఫికేషన్