Hair loss prevention | జుట్టు రాలకుండా ఉండాలంటే ఇవి ట్రై చేయండి..!
Hair loss prevention | అందమైన ముఖానికి తలపై వెంట్రుకలు కూడా తోడ్పాటునందిస్తాయి. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా జుట్టు రాలకుండా...
Hair loss prevention | అందమైన ముఖానికి తలపై వెంట్రుకలు కూడా తోడ్పాటునందిస్తాయి. కురులతోనే మన ముఖారవిందం వెలిగిపోతుంది. అయితే, వివిధ కారణాలతో ఇప్పుడు నవయువకుల్లోనే జుట్టు రాలిపోతూ తీవ్ర మనోవేధనలోకి దింపేస్తున్నది. మార్కెట్లో దొరుకుతున్న రకరకాల షాంపూలు, నూనెలు, క్రీములు వాడుతూ ఇంకా జుట్టును కోల్పోయేలా చేసుకుంటున్నారు. అలా కాకుండా కొన్ని టిప్స్ పాటించడం ద్వారా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు.
పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యతోపాటు కాంట్రాసెప్టీవ్ పిల్స్ వాడకం, ఒత్తిడి, రసాయనాలుండే హెయిర్ ప్రాడక్టులు వాడటం వల్ల జుట్టు విపరీతంగా లాస్ అవుతుంటుంది. ముఖ్యంగా విటమిన్ లోపం వల్ల, వయసు పెరిగిపోతుండటం వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది.
హెర్బల్ డికాక్షన్
తులసి ఆకులు, మందార ఆకులను గిన్నెలో వేసి నీరు రంగు మారేంత వరకు మరిగించాలి. అనంతరం ఈ నీటిని వడకట్టి వారానికి ఒకసారి చొప్పున తలకు పెట్టుకుని మసాజ్ చేసుకోవాలి.
టీపొడీతో తులసి
కప్పు నీటిలో టీపొడి వేసి దానిలో తులసి ఆకులు వేసి మరిగించాలి. అనంతరం దానికి సాధారణ షాంపూ కలిపి తలస్నానం చేస్తుండాలి. ఇలా వారంలో రెండు సార్లు తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.
వేప నూనె
వేపాను మెత్తగా రుబ్బి తలకు పట్టించుకోవచ్చు. లేదా వేపాకుల్ని గిన్నేలో వేసి నీరు పోసి బాగా మరిగించాలి. తర్వాత బాగా చల్లార్చి వడగట్టి ఈ నీటితో తలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. తలలో ఉండే ఇన్ఫెక్షన్లను కూడా తొలగించుకోవచ్చు.
కలబంద గుజ్జు
జుట్టు రాలడాన్ని అరికట్టడంలో కలబంద గ్రేట్‌గా పనిచేస్తుంది. కొబ్బరినూనె గోరువెచ్చగా వేడి చేసి చల్లార్చి దీనికి కలబంద గుజ్జు చేర్చి తలకు పట్టించాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా పట్టించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
నిమ్మరసం
రెండు నిమ్మకాయల నుంచి రసం తీసి రెండు కప్పుల నీటిలో కలిపి ఒక సీసాలో పెట్టుకోవాలి. దీన్ని నిత్యం జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అంది ఆరోగ్యంగా తయారవుతుంది.
మెంతులు
కప్పు మెంతులను రాత్రి సమయంలో పుల్లటి పెరుగుతో కలిపి నానబెట్టి ఉదయాన్ని రుబ్బుకుని తలకు పూతలా మర్ధన చేసుకోవాలి. అర్ధగంట తర్వాత స్నానం చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. ఇలా వారంలో ఐదు రోజులు తలకు పూసుకుని తలస్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.
ఉల్లిరసం
ఉల్లిలో సల్ఫర్ ఉండి జుట్టు కుదుళ్లకు ఆరోగ్యం చేకూరుస్తుంది. దీనిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లరు తగ్గిస్తుంది. ఉల్లిపాయలు రెండు తీసుకుని గ్రైండ్ చేసుకుని గుజ్జు నుంచి తీసిన రసాన్ని తలకు రాసుకుని అర్ధ గంట పాటు ఉంచుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేయడం ద్వారా ఫలితం చూడొచ్చు.
జుట్టును మర్ధన చేసేటప్పుడు గోర్లు జుట్టు కుదుర్లకు గట్టిగా తాకకుండా జాగ్రత్తపడాలి. గోరు వెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. హెయిర్ డ్రెస్సర్‌ను వాడొద్దు. అవకాడో, బెర్రీలు, క్యారట్, బీట్ రూట్, మష్రూం, అరటిపండు, గుడ్లు, ఓట్స్, తృణధాన్యాలతోపాటు బీటా కెరోటిన్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, ఫోలేట్ అధికంగా ఉండే పాలకూర తింటే జుట్టు బాగా పెరుగుతుంది. డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

