పిల్లల చురుకైన మెదడుకు బెస్ట్ ఫుడ్స్ ఇవే

హైదరాబాద్ : మెదడు.. శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగా మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహిస్తుంది. సరైన ఆహారం మీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అందువల్ల చిన్నతనంలోనే పిల్లలు మెదడు పెంచే అధిక పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు డైటీషియన్ విధి చావ్లా పలు బెస్ట్ ఫుడ్స్‌ను సూచిస్తున్నారు.
గుడ్లు:
పిండి పదార్థాలు, ప్రోటీన్, తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వుల కలయికతో కూడిన ఆహారాన్ని మీ పిల్లలకు ఉదయం వేళల్లో అల్పాహారం ఇచ్చినట్లయితే వారు రోజంతా శక్తివంతంగా ఉండటానికి అది దోహదపడుతుంది. గ్రుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బోనస్‌గా అవి కోలిన్ కలిగి ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తి మెరుగుదలకు సహాయపడుతుంది.
చేపలు :
ఆయిలీ ఫిష్‌లలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సాల్మన్, మాకేరెల్, ఫ్రెష్ ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కావునా వారానికి ఒకసారి వీటిని ఆహారంగా తీసుకోవాలి.
వోట్స్ / వోట్మీల్ :
వోట్మీల్, వోట్స్ మెదడుకు అద్భుతమైన శక్తి వనరులను అందిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో విటమిన్లు ఇ, బి కాంప్లెక్స్, జింక్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదళ్ళు చురుకుగా పనిచేయడానికి సహాయపడతాయి. ఆపిల్, అరటి, బ్లూబెర్రీస్ లేదా బాదం వంటి ఏదైనా టాపింగ్‌తో వినియోగించవచ్చు.
రంగురంగుల కూరగాయలు :
రంగు రంగుల కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. టమాటా, చిలగడదుంపలు, గుమ్మడికాయ, క్యారెట్లు, బచ్చలికూర ఇటువంటి కూరగాయలు పిల్లల ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
పాలు, పెరుగు, జున్ను :
పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్సిమీటర్లు, ఎంజైమ్‌ల పెరుగుదలకు అవసరం. ఇవన్నీ మెదడులో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. ఈ ఆహారాలలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన దంతాలు, ఎముకల అభివృద్ధికి అవసరం. పిల్లల కాల్షియం అవసరాలు వారి వయస్సును బట్టి మారుతుంటాయి కావునా వారి ఆహారంలో తగినంత కాల్షియం వనరులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
బీన్స్ :
ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాల లభించే మరో గొప్ప వనరు బీన్స్. పింటో బీన్స్ ఇతర బీన్స్ కంటే ఒమేగా 3 ను అధికంగా కలిగి ఉంటాయి. బీన్స్‌ను సలాడ్‌గా ఇతర ఆహార పదార్థాల మీద చల్లి పిల్లలకు ఇవ్వొచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

