World Rabies Day | కుక్కలు మనుషులకు అంత్యంత నమ్మకమైన జంతువులు. చాలా మంది తమ ఇండ్లల్లో కుక్కలను పెంచుకుంటుంటారు. అయితే, ఎంత ఇష్టపడి పెంచుకుంటున్నా ఏదో ఒక సందర్భంలో వాటి పంటి కోరలకు బలికావాల్సిందే. ఇవాల ప్రపంచ రేబీస్ డే. ఈ సందర్భంగా కుక్క కరిచిన సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కాన్సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో.. ఎలాంటి వ్యాధులకు గురికావాల్సి వస్తుందో.. తెలుసుకుందాం.
ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ జ్ఞాపకార్ధం ప్రతి ఏటా సెప్టెంబర్ 28 ని వరల్డ్ రేబీస్ డేగా జరుపుతారు. రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ను డెవలప్ చేసిన లూయిస్ పాశ్చర్ మరణించిన సెప్టెంబర్ 28 ని ప్రపంచ రేబీస్ డే నిర్వహిస్తుననారు. జంతువులపై రేబీస్ ప్రభావంపై అవగాహన పెంచడం, రేబీస్ వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది ఈ వరల్డ్ రేబీస్ డే ముఖ్యోద్దేశం. ఈ ఏడాది వన్ హెల్త్.. జీరో డెత్ అనే నినాదంతో ముందుకొస్తున్నారు.
ఎలా వ్యాపిస్తుంది..
వాతావరణంలో మార్పులు సంభవించి వేడి ఎక్కువైన సందర్భాల్లో కుక్కల్లో తిక్క పెరిగిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ సమయంలో తమ ముందున్నది యజమాని అయినా.. మరొకరైనా చిరాకొచ్చి కరిచేస్తుంటాయి. ఈ సందర్భంలో ఆ కుక్కలో రేబీస్ వైరస్ ఉంటే అది ఆ మనిషిలోకి చేరుతుంది. రేబీస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. అయితే ఈ వ్యాధిని విజయవంతంగా నివారించే వీలున్నది.
ఈ వైరస్ సోకిన జంతువుల లాలాజలం నుంచి ప్రజలకు వ్యాపిస్తుంది. వీధి కుక్కలు లేదా టీకాలు వేయని కుక్కల నుంచి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, విపరీతమైన జ్వరం, లాలాజల పక్షవాతం, మానసిక రుగ్మత, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లోనే మరణానికి దారితీస్తుంది. వీధి కుక్కల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. గొంతులోని అవయవాలు పనిచేయక పక్షవాతానికి గురైనట్లు కనిపిస్తాయి.
నివారణ ఇలా..
కుక్క కాటు గాయాలకు త్వరగా టీకా తీసుకోవాలి. రేబీస్ సోకిన కుక్క కరవగానే కరిచిన చోట వెంటనే సబ్బుతో శుభ్రంగా కడగాలి. రక్తం కారకుండా మంచి గుడ్డతో మెల్లగా తుడవాలి. యాంటీ బయోటిక్ క్రీమ్ అందుబాటులో ఉంటే రాయాలి. బ్యాండేజీతో గాయం చుట్టూ చుట్టాలి. అవకాశం ఉంటే అయోడిన్ సొల్యూషన్ వేయాలి. ఇలా చేయడం వల్ల 90 శాతం రేబీస్ బారిన పడకుండా చూడొచ్చు. అవసరమైతే యాంటీసెప్టిక్ లోషన్ అప్లై చేయాలి. ధనుర్వాత రాకుండా టీటీ తీసుకోవాలి. గాయం పెద్దదైతే మానడానికి యాంటీ బయోటిక్స్ వాడాలి. ఐవీ ఇమ్యునో వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇంట్లో పెంచుకునే వాటికి సమయాన్ని బట్టి వ్యాక్సిన్ వేస్తూ ఉండాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.