న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక ప్రకటన చేశారు. ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఇంధన ఒప్పందం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు. వెనిజువెలా దేశంతో ఆ డీల్ కుదిరినట్లు వెల్లడించారు. ట్రుత్ సోషల్ అకౌంట్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే దక్షిణ అమెరికా దేశంలోని ఇంధన నిక్షేపాలను అమెరికా వినియోగించుకోనున్నట్లు చెప్పారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియా, రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్, వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ చర్చల్లో ఆ డీల్ కుదిరినట్లు పేర్కొన్నారు.
ఈ డీల్‌లో భాగంగా 17 ఆయిల్ ఫీల్డ్స్‌ను డెవలప్ చేయనున్నట్లు వెనిజువెలా అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు. సుమారు 65 బిలియన్ల బ్యారెళ్ల ఇంధనం వెలికితీసే అవకాశాలు ఉన్నాయి. వెనిజువెలా ఆయిల్ ఇండస్ట్రీలోకి సుమారు వంద బిలియన్ల డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల పన్నుల రూపంలో సుమారు 209 బిలియన్ల డాలర్లు వసూల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వెనిజువెలా సర్కారు తెలిపింది.