Foods | ఈ ఆహారాలు శక్తిని అందించేవిగా అనిపిస్తాయి.. కానీ వాస్తవానికి జరిగేది వేరే.. ఎలాగంటే..?
రోజంతా ఉత్సాహంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలే తెలియకుండానే శక్తి స్థాయిలను తగ్గిస్తాయి. మొదట్లో ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించినట్లు అనిపించినప్పటికీ, కొంతసేపటికే అలసట, నిస్సత్తువ, ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు కారణమవుతాయి.
Foods | రోజంతా ఉత్సాహంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలే తెలియకుండానే శక్తి స్థాయిలను తగ్గిస్తాయి. మొదట్లో ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించినట్లు అనిపించినప్పటికీ, కొంతసేపటికే అలసట, నిస్సత్తువ, ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి మళ్లీ తగ్గించే ఆహారాలు శక్తిని నిలకడగా ఉంచలేవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శక్తి స్థాయిలను తగ్గించే కొన్ని ఆహార పదార్థాల గురించి వారు వివరిస్తున్నారు.
పండ్ల రసాలు..
పండ్ల రసాలు ఆరోగ్యకరమైన ఎంపికగా కనిపించినప్పటికీ, వాటిలో ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో చక్కెర వేగంగా శోషణ వేగంగా జరుగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, కొద్దిసేపటికే వేగంగా తగ్గిపోతాయి. ఫలితంగా అలసట, నీరసం అనిపిస్తాయి. అందుకే జ్యూస్‌లకు బదులుగా సంపూర్ణ పండ్లను తీసుకోవడం శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతాయి. కాఫీ లేదా టీ వంటి కెఫీన్ పానీయాలు తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచినప్పటికీ, తరచూ వాటిపై ఆధారపడటం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఎక్కువసార్లు కెఫీన్ తీసుకోవడం వల్ల శరీరంలోని సహజ శక్తి చక్రం దెబ్బతిని, కొంతకాలానికి మరింత అలసటను కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల కెఫీన్‌ను పరిమిత మోతాదులోనే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
తెల్ల బియ్యం, ఎనర్జీ డ్రింక్స్..
క్రీమీ పాస్తా లేదా అధిక పరిమాణంలో తెల్ల బియ్యంతో చేసిన భోజనాలు జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. దీంతో భోజనం చేసిన వెంటనే నిద్రమత్తు, బద్ధకం, శక్తి లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం కోల్పోయే అవకాశం ఉంటుంది. షుగర్ ఫ్రీ అని లేబుల్ చేసిన ఎనర్జీ డ్రింక్స్ కూడా ఎప్పుడూ ఆరోగ్యకరమైనవిగా ఉండవు. వీటిలో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు, ఉత్తేజకాలు జీవక్రియలపై, నిద్రపై ప్రభావం చూపిస్తాయి. మొదట్లో శక్తిని ఇచ్చినట్లు అనిపించినప్పటికీ, తరువాత అలసట, అసౌకర్యాన్ని కలిగించే అవకాశముంటుంది. దీర్ఘకాలంలో ఇవి సహజ శక్తి నియంత్రణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తాయి.
బిస్కెట్లు, ఇతర చిరుతిళ్లు..
బిస్కెట్లను త్వరగా తినడానికి సులభమైన చిరుతిండిగా చాలామంది ఎంచుకుంటారు. అయితే వీటిలో సాధారణంగా మైదా, అధిక చక్కెర ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి, వెంటనే తగ్గించడంతో తాత్కాలిక శక్తి మాత్రమే అందిస్తాయి. ఫలితంగా మళ్లీ ఆకలి, అలసట త్వరగా వచ్చేస్తాయి. అందువల్ల బిస్కెట్లకు బదులుగా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన చిరుతిండ్లను ఎంచుకోవడం మంచిది. శక్తి తగ్గడానికి ఈ ఆహారాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, వాటి వినియోగంపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు చేయడం ద్వారా శక్తి స్థాయిలను మెరుగుపరుచుకోవడంతోపాటు రోజంతా చురుకుగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- foods
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

