Avocado | శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించే అవకాడో.. రోజూ తీసుకుంటే ఎంతో మంచిది..
మనం ఆహారంగా తీసుకోదగిన పండ్లల్లో అవకాడో ఒకటి. ప్రస్తుతం అవకాడో ఫిట్నెస్ ప్రియులు ఎక్కువగా తీసుకుంటున్న ఆహారాల్లో ఒకటిగా మారింది. సలాడ్లు, స్మూతీలు, టోస్ట్‌లు, గ్వాకమోలే వంటి వంటకాలలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. తక్కువ చక్కెరలు, మంచి కొవ్వులు అధికంగా ఉండటంతో అవకాడోకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.
Avocado | మనం ఆహారంగా తీసుకోదగిన పండ్లల్లో అవకాడో ఒకటి. ప్రస్తుతం అవకాడో ఫిట్నెస్ ప్రియులు ఎక్కువగా తీసుకుంటున్న ఆహారాల్లో ఒకటిగా మారింది. సలాడ్లు, స్మూతీలు, టోస్ట్‌లు, గ్వాకమోలే వంటి వంటకాలలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. తక్కువ చక్కెరలు, మంచి కొవ్వులు అధికంగా ఉండటంతో అవకాడోకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. మృదువైన వెన్నలాంటి గుజ్జుతో ఉండే ఈ పండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు వారాల పాటు ప్రతిరోజూ అవకాడో తింటే శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని పేర్కొంటున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గేందుకు..
అవకాడోలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌గా భావించే ఎల్డీఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పండులో ఫైబర్‌తోపాటు కొన్ని మొక్కల సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. అవకాడోలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక వల్ల అవకాడో ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గే అవకాశం ఉంటుంది. రోజుకు అర అవకాడో నుంచి ఒక అవకాడో వరకు తీసుకోవడం చాలామందికి సరిపోతుందని సూచిస్తున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికం..
వెన్న, మయోనైస్ లేదా ఎక్కువ క్రీమ్ ఉండే డ్రెస్సింగ్‌లకు బదులుగా అవకాడోను ఉపయోగిస్తే ఆహారంలోని కొవ్వుల నాణ్యత మెరుగుపడుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. అవకాడోలో గ్లుటాథయోన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కాలేయం హానికర పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు. అలాగే ఇందులో విటమిన్ సి, బి9, ఇ లాంటి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లు ఉండటంతో శరీర కణాలను రక్షించడంలో ఉపయోగపడతాయి. కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఖనిజాలు కూడా ఇందులో లభిస్తాయని చెబుతున్నారు. ఒలెక్ యాసిడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు కూడా అవకాడోలో ఉండటం వల్ల శరీరానికి మంచి శక్తిని అందించడంలో ఇది సహాయపడుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే అవకాడో సమతుల ఆహారంలో ఆరోగ్యకరమైన ఎంపికగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Avocado
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

