Stronger Legs | శరీరంలోని అన్ని అవయవాలు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు శరీరం ఎంత దృఢంగా ఉన్నప్పటికీ కాళ్లు బలహీనంగా ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంటుంది. అలాగే కండరాల నిర్మాణం కూడా సరిగ్గా ఉండదు. దీంతో పాదాల నొప్పులు వస్తుంటాయి. అయితే సరైన ఆహారం తీసుకుంటే శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్లు ఆరోగ్యంగా ఉండి కండరాల నిర్మాణం జరగాలంటే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. పలు ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కాళ్లను దృఢంగా ఉంచుకోవచ్చు. కాళ్లలో ఉండే కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక అందుకు ఏమేం ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చికెన్‌లో లెగ్ పీస్‌లను తింటుంటారు. ప్రోటీన్లు కావాలంటే చికెన్ బ్రెస్ట్ పీస్‌లను తినాలి. లెగ్ పీస్‌లకు కొవ్వు బాగా ఉంటుంది. కనుక లెగ్ పీస్‌లను తినకూడదు. బ్రెస్ట్ పీస్‌లలో ప్రోటీన్లు ఉంటాయి. కనుక బ్రెస్ట్ పీస్‌లను తింటే కండరాలకు బలం కలుగుతుంది. ముఖ్యంగా కాళ్లలో ఉండే కండరాలు నిర్మాణం అవుతాయి. కండరాలు దృఢంగా మారుతాయి. అదేవిధంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతోపాటు కండరాలకు బలం కలుగుతుంది. పెరుగును తింటున్నా కూడా కాళ్లు బలంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగులో ఉండే ప్రొబయోటిక్ ఆహారాలు, ప్రోటీన్లు కండరాలకు మేలు చేస్తాయి. కనుక పెరుగును రోజూ తినాలి.
పనీర్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పనీర్ ద్వారా మనకు ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో కండరాల నిర్మాణం జరుగుతుంది. కాళ్లు బలహీనంగా ఉన్నవారు పనీర్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కాళ్లలోని కండరాలు దృఢంగా మారుతాయి. కాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పాలకూరను తినడం వల్ల కూడా కాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి కావల్సిన క్యాల్షియం లభించడంతోపాటు ప్రోటీన్లు కూడా అందుతాయి. దీంతో కాళ్లు దృఢంగా మారుతాయి. అలాగే కాళ్లు బలంగా మారాలంటే చిలగడదుంపలను కూడా తినవచ్చు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావల్సిన ప్రోటీన్లను, శక్తిని అందిస్తాయి.
ఇక సముద్రపు చేపలను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు ఈ చేపలను తింటే మంచిది. దీంతో మన శరీరానికి కావల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి కండరాల నిర్మాణానికి ఎంతగానో దోహదం చేస్తాయి. దీంతో కాళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. అలాగే క్వినోవాను కూడా తినవచ్చు. ఇవి శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి. కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. ప్రోటీన్లను అందిస్తాయి. దీని వల్ల కాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా చియా విత్తనాలను కూడా తినవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి కాళ్లను బలంగా మారుస్తాయి. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల కాళ్లు బలంగా మారుతాయి. శరీరానికి కూడా శక్తి లభిస్తుంది.