Body Detox Fruits | మన శరీరంలో అనేక జీవక్రియలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. జీవక్రియలు జరగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ క్రియలతోపాటు ఎప్పటికప్పుడు వ్యర్థాలు కూడా బయటకు వస్తుంటాయి. కానీ కొన్ని రకాల వ్యర్థాలు మాత్రం శరరీంలో ఎప్పటికీ అలాగే ఉంటాయి. కనుక శరీరాన్ని అప్పుడప్పుడు డిటాక్స్ చేస్తుండాలి. దీంతో వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే కొన్ని రకాల పండ్లను తింటే శరీరాన్ని అంతర్గతంగా శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇందుకు గాను ఖరీదైన చికిత్సలు తీసుకోవాల్సిన పనిలేదు. ఇక శరీరాన్ని శుభ్రం చేసే ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయలను తరచూ తీసుకుంటుండాలి. దీంతో శరీరం డిటాక్స్ అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. 100 గ్రాముల నిమ్మరసం ద్వారా మనకు సుమ సుమారుగా 53 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. లివర్ పనితీరును క్రమబద్దీకరిస్తుంది. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. రోజూ నిమ్మరసాన్ని సేవిస్తుంటే శరీరాన్ని అంతర్గతంగా శుభ్రంగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా శరీరాన్ని క్లీన్ చేయడంలో నారింజ పండ్లు కూడా ఎంతగానో దోహదపడుతాయి. రోజూ ఒక నారింజ పండును తింటుంటే శరీరం డిటాక్స్ అవుతుంది. 100 గ్రాముల నారింజ పండ్లను తినడం వల్ల మనకు సుమారుగా 53.2 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం సహజసిద్ధంగా డిటాక్స్ అవుతుంది. వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి.
మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. వీటిని తినడం వల్ల కూడా శరీరం డిటాక్స్ అవుతుంది. బొప్పాయి పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అందువల్ల బొప్పాయి పండును కూడా రోజూ తినవచ్చు. ఇది శరీరాన్ని సహజసిద్ధంగా శుభ్రం చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. గ్రేప్ ఫ్రూట్‌ను తింటున్నా కూడా శరీరం క్లీన్ అవుతుంది. ఇందులోనూ విటమిన్ సి ఉంటుంది. ఇది పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా లివర్ మెరుగ్గా పనిచేస్తుంది. వ్యర్థాలను సులభంగా బయటకు పంపుతుంది. రోజుకు ఒక గ్రేప్ ఫ్రూట్‌ను తింటుంటే ఫలితం ఉంటుంది.
పుచ్చకాయలు ఒకప్పుడు కేవలం వేసవిలోనే లభించేవి. కానీ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పండ్లను తినవచ్చు. పుచ్చకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. శరీరం అంతర్గతంగా క్లీన్ అయ్యేలా చేస్తాయి. కనుక పుచ్చకాయలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. పైనాపిల్ పండ్లలో బ్రొమెలియన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతోపాటు వాపులు కూడా తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఇలా పలు రకాల పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.