Sprouted Black Chickpeas | నల్ల శనగలను మనం తరచూ తింటూనే ఉంటాం. వీటితో పలు రకాల వంటకాలను చేస్తుంటారు. నల్ల శనగలను నీటిలో నానబెట్టి అనంతరం వాటిని ఉడికించి పోపు వేసి గుడాల్లా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పైగా అనేక పోషకాలు లభిస్తాయి. అయితే నల్ల శనగలను మొలకెత్తించి తింటే ఇంకా ఎక్కువ లాభాలను పొందవచ్చు. రెట్టింపు మొత్తంలో పోషకాలను కూడా పొందవచ్చు. మొలకెత్తిన నల్ల శనగలను మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఈ శనగలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మొలకెత్తిన నల్ల శనగలను తింటే అనేక విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
మొలకెత్తిన శనగల్లో ఉండే విటమిన్ సి చర్మ సంరక్షణకు సైతం సహాయం చేస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. మొలకెత్తిన శనగల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీని వల్ల తీవ్ర రక్త స్రావం జరగకుండా ఉంటుంది. మొలకెత్తిన నల్ల శనగల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. ఈ శనగలను తినడం వల్ల ఫైటిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది మినరల్స్‌కు అతుక్కుంటుంది. అందువల్ల మనం తినే ఆహారంలో ఉండే మినరల్స్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాలు లభిస్తాయి. పోషకాహార లోపం తగ్గుతుంది.
మొలకెత్తిన నల్ల శనగలను తింటుంటే ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కండరాల మరమ్మత్తులకు, నిర్మాణానికి సహాయం చేస్తాయి. దీని వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారికి ఎంతో మేలు జరుగుతుంది. తిరిగి శక్తిని పుంజుకోవచ్చు. దీంతో ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. మొలకెత్తిన నల్ల శనగలను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీని వల్ల అజీర్తి తగ్గుతుంది. అలాగే మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
మొలకెత్తిన నల్ల శనగల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. పైగా ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఈ శనగలను తింటుంటే ఫలితం ఉంటుంది. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. మొలకెత్తిన నల్ల శనగలను తింటుంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ఇలా ఈ శనగలను తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.