Soaked Anjeer | ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఆలోచిస్తుంటారు. ఎలాంటి ఆహారాలను తినాలని అన్వేషిస్తుంటారు. అయితే అలాంటి వారికి అంజీర్ ఎంతగానో మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంజీర్ పండ్లు మనకు రెండు రకాలుగా మార్కెట్లో లభిస్తాయి. సాధారణ పండ్లతోపాటు ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయి. అంజీర్ పండ్లు మనకు కేవలం సీజన్లోనే లభిస్తాయి. కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. కనుక డ్రై ఫ్రూట్స్‌ను తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంజీర్ పండ్లను తినడం వల్ల అనేక పోషకాలు లభించడంతోపాటు వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు. అయితే అంజీర్ పండ్లను నేరుగా తినలేరు. కనుక నీటిలో నానబెట్టి తినాలి. రాత్రి పూట 3 అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టి వాటిని మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తింటే ఎంతో మేలు జరుగుతుంది.
అంజీర్ పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే మలబద్దకం అన్న మాటే ఉండదు. ఈ పండ్లు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. అంటే ఈ పండ్లను తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. అంజీర్ పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంజీర్ పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్లతోపాటు పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను ఉదయం తింటే శరీరానికి రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట తగ్గుతాయి. ఎంత పనిచేసినా అలసిపోరు. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా మారుతారు. బద్దకం పోతుంది.
అంజీర్ పండ్లలో క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు పటిష్టంగా మారేలా చేస్తాయి. అంజీర్ పండ్లను నానబెట్టడం వల్ల ఈ పోషకాల శాతం మరింత పెరుగుతుంది. ఈ పండ్లను తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళలకు ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బీపీ తగ్గుతుంది. హైబీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. రక్త నాళాలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి.
అంజీర్ పండ్లను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. అంజీర్ పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల షుగర్ లెవల్స్ పెరగవు. కనుక షుగర్ ఉన్నవారు సైతం ఈ పండ్లను నిర్భయంగా తినవచ్చు. పైగా ఈ పండ్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులు తగ్గిపోతాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇలా రోజూ రాత్రి 3 అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టి వాటిని మరుసటి రోజు ఉదయం తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.