Black Grapes | ద్రాక్ష పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ద్రాక్ష పండ్లలోనూ మనకు పలు రకాలు లభిస్తుంటాయి. ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉండే ద్రాక్ష పండ్లను చాలా మంది కొంటుంటారు. ఇవి రుచిలోనే కాదు, పోషకాల పరంగా కూడా తేడాలను కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు ఆకుపచ్చ ద్రాక్షలను ఇష్టపడుతుంటారు. కొందరు నలుపు రంగు పండ్లను అధికంగా తింటారు. అయితే ఇవి మనకు భిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలోనే ఆరోగ్యం కోసం నల్ల ద్రాక్ష పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నలుపు రంగు ద్రాక్ష పండ్లను తినడం వల్ల అనేక పోషకాలు లభించడంతోపాటు పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని అంటున్నారు. నలుపు రంగు ద్రాక్షలను ఆహారంలో తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.
నలుపు రంగు ద్రాక్ష పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే రెస్వెరెట్రాల్, క్వర్సెటిన్ తదితర సమ్మేళనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ పండ్లలో ఆంథోసయనిన్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవన్నీ రుచిని అందిచడమే కాదు, వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. ముఖ్యంగా శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. దీని వల్ల వాపులు తగ్గుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవచ్చు. నలుపు రంగు ద్రాక్ష పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలని చూస్తున్న వారికి నలుపు రంగు ద్రాక్ష పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను రోజువారి ఆహారంలో తింటుంటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. నలుపు ద్రాక్షల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.
నలుపు రంగు ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం ప్రకారం ద్రాక్ష పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల ద్రాక్షలను తింటుంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. కొలెస్ట్రాల్, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతాయి. రక్తనాళాలు వెడల్పుగా మారుతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గి, బీపీ నియంత్రించబడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల ద్రాక్షల్లో అనేక వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు కళ్లను సంరక్షిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దీని వల్ల రెటీనా సురక్షితంగా ఉంటుంది. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు.
నల్ల ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్, రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల నల్ల ద్రాక్షలను రోజూ తింటుంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నల్ల ద్రాక్షలను తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్షల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇలా నల్ల ద్రాక్షలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఈ పండ్లను తినాలి.